దీక్షని విరమించిన రామ్మోహన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సాయంత్రం వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ దీక్ష కి దిగారు. ఇలా ఈ దీక్ష 15 గంటల పాటు సాగింది. పలువురు నేతలతో విద్యార్థులతో రామ్మోహన్ ఈ దీక్ష చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లను కుర్ధా డివిజన్‌ నుండి తప్పించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ ఏడు రైల్వేస్టేషన్లను విశాఖ డివిజన్‌లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

ఇలా 15 గంటలు గడిచిన అనంతరం ఈరోజు ఉదయం 9 గంటలకు స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు నిమ్మరసం ఇచ్చి రామ్మోహన్ దీక్షని విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే జోన్ ఇచ్చిన తమకి ఎటువంటి సంతోధామ్ లేదని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: