ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మషేశ్వర్ రావు ప్రభుత్వం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై విమర్శలు చేశారు. జగన్ కెసిఆర్ పట్టాన చెరీ అన్యాయాలకి పాల్పడుతున్నాడని ఆయనని A1 ముద్దాయిగా చేసి వెంటనే అరెస్ట్ చీయాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు ఉదయం ఆయన విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జగన్ కేసీఆర్ లపై విమర్శలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ నెల్లూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇది పద్ధతి కాదు వ్యక్తిగతంగా ఎవ్వరయనా దాడి చేయగలరు అని ఆయన అన్నారు. ఈరోజు ఐటీ యాక్ట్ దుర్వినియోగం జరుగుతుంది జగన్ కేసీఆర్ పట్టాన చెరీ ఈ చర్యలకి పాల్పడుతున్నాడు. తెలంగాణ లో గేమ్ జరిగింది ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కేసీఆర్ సమక్షంలో ఈ గేమ్ జరుగుతుంది అని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణలో 20 లక్షల ఓట్లు తొలగించి ప్రజలను మోసం చేసి గెలిచారు ఇప్పుడు ఇదే స్థాయి లో ఇపుడు ఏపీ లో కూడా సన్నాహాలు చేసి జగన్ ను గెలిపించాలని చూస్తున్నారు.
జగన్ కేసీఅర్ తో కుమ్మక్కై ఎపీలో అరాచకం సృష్టించే పనిలో ఉన్నారు. ప్రభుత్యం డేటా సేకరించి పెన్షన్ లు ఇస్తుంటే దాన్నీ కూడా తప్పు పడుతున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన రిపోర్ట్ లో.. పండ్ల ఉత్పత్తిలో 24 రాష్ట్రలో మన రాష్ట్రము మొదటి స్తానంలో ఉంది ఈ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు.. జగన్ ప్రత్యేక హోదా గురించి మోదీతో అస్సలు మాట్లాడం లేదు ఇదేనా ప్రతిపక్ష నేత లక్షణం..? జగన్ అమరావతి నిర్మాణం నిజం కాదు అంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు.. జగన్ కళ్ళు తెరిచి అమరావతి వచ్చి చూడాలి ఆ తరువాత ఆయనని మాట్లాడమనండి.. అసలు జగన్ మోహన్ రెడ్డిని A1 ముద్దయిగా నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని ఆయన అన్నారు.