బకాయిలు వెంటనే తెప్పిస్తాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేబినెట్ హైలైట్స్ :

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై చర్చ జరిగింది. విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టటం, పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీకి సహకరించకపోవటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వేసవిలో ఎదురయ్యే తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, పశుగ్రాస కొరత లేకుండా, నిధుల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి రూ.10 కోట్ల కార్పస్ నిధితో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అనంతరం సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు కేబినెట్ బేటీ వివరాలను తెలియచేశారు. పసుపు కుంకుమ కింద మహిళా సంఘం సభ్యరాళ్ళుకు అందిస్తున్నసహాయంలో భాగంగా తొలిదశలో రూ.8వేల 604 కోట్లు విడుదల చేసి 4 విడతల్లో అందించటం జరిగిందని కాల్వ తెలిపారు. దీన్ని 8లక్షల54 వేల 524 గ్రూప్ ల్లోని 86 లక్షల మందికి అందించారు. 2 వదశలో 9లక్షల 63వేల 624 సంఘాలలోని 97 లక్షల 94వేల200 మంది సభ్యులకు 3 విడతలుగా రూ.9వేల794 కోట్ల రూపాయలు అందిస్తామని ఆయన చెప్పారు. పసుపు కుంకుమ కింది ఎక్కడా నిధుల కొరత రాకుండా చూడాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లకింద వివిధ వర్గాలకు వృధ్ధులకు వితంతువులకు అందించే పెన్షన్ రూ.2000 చేశారు. దివ్యాంగులకు ఇచ్చేరూ.500 ను రూ.3000 వేలు చేశారు. వీరికతో పాటు అర్హత ఉన్న లక్షా 10వేల 551 మంది ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం పెన్షన్ లు అందిస్తొందని మంత్రి వివరించారు. ఫిబ్రవరి నెలలో అన్ని రకాల పెన్షన్ లు రూ. 1135.43 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
అగ్రి గోల్డ్ బాధితులు, జర్నలిస్టుల హౌసింగ్, పై కూడా చర్చ జరిగిందని కాల్వ తెలిపారు. సింగిల్ డబుల్ ట్రిపుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లో 204 ఫైర మెన్ పోస్టుల ఉన్నతీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు సీఆర్డీఏ పరిధిలో మూడు ఎకరాలస్ధలం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: