ఎన్నికలు దేగ్గర పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సెగలు రగులుతున్నాయి.. తాజాగా కలకలం రేపుతున్న డేటా చోరీ వివాదం పై తెలుగు దేశం పార్టీ నేతలు అధినేత ప్రత్యేక దృష్టి సారిస్తుంటే. నేనేమీ చేయలేదు నాకేది తెలియదు అనట్టుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. టిడిపి నేతలెమో జగన్ పై కేసీఆర్ ల పై ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేస్తుంటే మరోపక్క వైసీపీ అధినేత ఇదంతా పట్టించుకోకుండా వైసీపీ మేనిఫెస్టో రూపు కల్పనాలో బిజీగా ఉన్నారు.
ఈ సంధార్బంగా ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడ ఆయన ఏర్పాటు చేశారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ బుధవారం నాడు హైద్రాబాద్లో సమావేశమైంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అమలు చేయగలిగిన వాగ్ధానాలనే మేనిఫెస్టోలో చేర్చాలని జగన్ సూచించారు. మేనిఫెస్టో రూపుకల్పనలో వైసీపీ పార్టీ ఏ ఇతర పార్టీ తో పోటీ పడకుండా కేవలం తమ హామీలని పాథకాలని మాత్రమే మేనిఫెస్టో లో పెట్టాలని జగన్ కమిటీని సూచించారు. మేనిఫెస్టో సంక్షిప్తంగాను, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలని జగన్ కోరారు.
కౌలు రైతులకు న్యాయం చేసేలా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతాంగం కోసం చేపట్టాల్సిన చర్యలను చేర్చాలని ఆయన మేనిఫెస్టో కమిటీకి సూచించారు..అమలు చేయలేని వాగ్దానాల మేనిఫెస్టోలో ఉండొద్దని జగన్ కమిటీని సూచించారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోనేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడ ఆయన ఏర్పాటు చేశారు.