నిజామాబాద్ లో అమిత్ షా ప్రసంగం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో భాగంగా నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాల బూత్, శక్తి ఇన్‌చార్జీలు, నాయకుల సమావేశంలో ఆయన కార్యకర్తలని ఉత్తేజపరచడానికి ప్రసంగించారు.. ఈ సంధర్భంగా బీజేపీ పార్టీ యొక్క బలాలని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రభుత్వం ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పై ఆయన విమర్శలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. మరోసారి మోదీని గెలిపించడం కోసం మోదీకి పట్టం కట్టడానికోసం దేశ ప్రజలు ఎగిరెగిరి చూస్తున్నారు. దేశంలోనే అత్యంత మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, దేశంలోనే అతిఎక్కువ ముఖ్యమంత్రి లను కలిగివున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే అత్యధికంగా ఎంపి స్థానాలు కైవసం చేసుకొని మోడీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలు మరియు కార్యకర్తల సాక్షిగా రాహుల్ ని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా.. మేము కేవలం 5ఏళ్లు అధికారం చేశాము, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది.. అసలు మీరు ప్రజలకి ఏం చేశారు..? దేశంలో పెదవారు ఎందరో అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు వారందరికీ ఆయుష్మాన్ భారత్ తో ఉచిత వైద్యం అందిస్తున్నాం.

ఈ దేశంకి కావాల్సిందంతా బీజేపీ నే ఇచ్చింది రూపు రేఖలు కూడా బీజేపీ నే దిద్దింది, పుల్వామా ఘటన లో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు చెక్ పెట్టడానికే సర్జికల్ స్ట్రైక్ చేశాం ఆ ఘనత నరేంద్రమోదీకే దక్కుతుంది. అమెరికా, జపాన్ లతో పోటీ పడుతున్న ఏకైక దేశం భారత దేశం అది కేవలం బీజేపీ నరేంద్రమోదీ తోనే సాధ్యం అయింది అని ఆయన అన్నారు.
దేశంలో అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులని తరిమికొట్టడం కూడా బీజేపీ తొనే సాధ్యం. రైతుల కోసం రైతు పెట్టుబడి కోసం సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. తెలుగు ప్రజల ప్రధాని పీవీ నరసింహారావు చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాలుగు అడుగుల స్థలం కూడా ఇవ్వలేక పోయింది అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. కాబోయే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరే.. మోదీకి మాత్రమే పూర్తి హక్కు ఉంది.

కేసీఆర్ జి సెప్టెంబర్17 ను ఎందుకు విమోచన దినంగా ప్రకటించలేదు… తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఉగ్రవాదులని తరిమికొట్టడం కేవలం నరేంద్రమోదీ ఒక్కరితోనే సాధ్యం…24 గంటలు పనిచేసే ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరే.

Share.

Comments are closed.

%d bloggers like this: