కరీంనగర్ లో కేటీఆర్ ప్రసంగం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కరీంనగర్ సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరీంనగర్ తో అనుభందం చాలా వుంది.. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా దిగ్విజయం అవుతుందని కేసీఆర్ బాగా నమ్ముతారు.. గడిచిన 5ఏళ్ళల్లో టీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఏప్రిల్ లేదా మే నుంచి పెన్షన్ 2 వేలు ఇవ్వబోతున్నాం.. ఈమేరకు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు కూడా చేసుకున్నాం..

త్వరలోనే రైతులకు రుణ మాఫీ అమలు చేయబోతున్నాం.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 11 ఎంపి సీట్లు వచ్చినా.. మోడీ ఏదో చేస్తారని చూశాం..! ఎంత కష్టపడ్డా Nda, upa కూటములకు.. 150 సీట్లు దాటడం లేదు. రెండు కూటములు కలిపి కూడా కేంద్రంలో ప్రభుత్వం పెట్టలేరు.. తెలంగాణ నుంచి గెలిచే ఒక్కొక్క ఎంపి చాలా ముఖ్యం.. ఢిల్లీ లో ఎవరు గద్దెనెక్కలో మనమే నిర్ణయం చేయబోతున్నాం..!

*ఎన్నికలు జరిగేది మోడీ రాహుల్ మధ్య అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజల జీవితం ఏమి మారలేదు..దొందూ దొందే.. అన్నట్టుగా ఉంది వారి వైఖరి. కేంద్రంలో వచ్చేది ఫెడరల్ ఫ్రంట్.. ఎవరి చేతిలో అధికారం వుంటే కేంద్రం నుంచి ఫండ్స్ వాళ్ళకే వెళ్తాయి. తెలంగాణ ఒకటి ఉందని కూడా మోడీ కి గుర్తు వుందో లేదో. బుల్లెట్ ట్రైన్ వేయాలంటే గుజరాత్ లోనే వేసుకున్నారు.. అందుకే మనం 16ఎంపి సీట్లు గెలవాలి.. ఏపి లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన మోడీ.. తెలంగాణలో కాళేశ్వరం లేదా పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు…?

మన 16 ఎంపి లు ఢిల్లీ లో వుంటే.. జాతీయ హోదా తన్నుకుంటూ వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ ఒకటి.. రెండు సీట్లు సాధించినా వీళ్ళు ఏమి చేయలేరు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్..కాంగ్రెస్ నేతలు ఢిల్లీ గులాములు. ఢిల్లీకి గులాము కావాలా.. తెలంగాణ గులాబీ లు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. త్వరలోనే కరీంనగర్ కు ట్రైన్ వస్తుంది. కరీంనగర్ ఎంపి ని 5 లక్షల ఓట్ల మెజార్టీ తో గెలిపించాలి గత కాంగ్రెస్ ఎంపి ఇక్కడ ఏమి చేయలేక పోయారు.. సీఎం కు అత్యంత సనిహితుడిగా వుండి ఆయన చనిపోతే ఆయన కొడుకు సీఎం కావాలని సంతకాలు చేయించుడు తప్ప ఏమీ చేయలేదు కాంగ్రెస్. బిజెపి నేతల మాయ మాటల్లో పడొద్దు.. కాంగ్రెస్ నేతలు సాటు మాటుగా పోయి రైతు బందు, రైతు భీమా చెక్కులు తెచ్చుకుంటున్నారు.. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే.. వాళ్ళను కూడా భరాభర్ ఓటు అడగాలి.. ఎంపి అభ్య ర్థులు ఎవరు అనేది కేసీఆర్ నిర్ణయిస్తారు.. ఆయన ఎవరిని చూపిస్తే వారికి ఓటు వేద్దాం.

Share.

Comments are closed.

%d bloggers like this: