కౌశల్ పై గొర్రెల పాట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కొద్ది రోజులుగా వివాదాలు వస్తున్నాయి. కౌశల్ అభిమానులు కౌశల్ మీద ఉన్న భీమానానికి కౌశల్ ఆర్మీగా ఏర్పడ్డారు. ఇలా తన అభిమానుల్ని చూసి కౌశల్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా వస్తున్న వివాదాలు చూస్తుంటే ఇప్పుడు కౌశల్ ఆర్మీ కౌశల్ పై తిరగబడింది. ఆర్మీలో చాలా మంది సభ్యులు కౌశల్ ని నమ్మి మోసపోయామని కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ వివాదం మీడియాకెక్కింది. ఇప్పుడు కొంతమంది కౌశల్ ఆర్మీ సభ్యులు ఓ వీడియో సాంగ్ రికార్డ్ చేశారు. కౌశల్ ని నమ్మి గోర్రెలం అయ్యమంటూ ‘అందరూ గొర్రెలే’ అనే పాటను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట సెన్సేషన్ గా మారింది. యుట్యూబ్ లో మరియు ఇతర సామాజిక మాద్యమాల్లో ఈ పాట వైరల్ అవుతుంది. ఒకప్పుడు కౌశల్ కి అనుకూలంగా పాటని కంపోజ్ చేసిన చెన్నైకి చెందిన అరవింద్ ఇప్పుడు కౌశల్ ని నమ్మి తప్పు చేశా అంటూ తన పాట ద్వారా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ పాటను విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: