వ్యాక్సిన్ కలకలం.. 15 మంది చిన్నారులకి విషమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు వాక్సిన్ పాలిట పడ్డారు. వ్యాక్సిన్ వికటించిన విషాయాన్ని హాస్పిటల్ యాజమాన్యం గుర్తించక ఆ వ్యాక్సిన్ ని చిన్నారులకి ఇచ్చారు దీంతో ఆ 15 మంది చిన్నారులు అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ ఘటన నాంపల్లి హెల్త్ సెంటర్లో చోటు చేసుకుంది. పరిస్థితి విషమం అయ్యేసరికి పిల్లలని నీలోజ్ఫర్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికి డాక్టర్లు మాత్రం చింతించాల్సిన పని లేదని చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. ఒక పక్క తల్లిదండ్రులు అయోమయం అవుతుంటే డాక్టర్లు నిస్సందేహంగా ఉన్నారు.

వ్యాక్సిన్ తర్వాత నొప్పి రాకుండా ఇవ్వాల్సిన మందులకు బదులు వేరేవి ఇవ్వడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు అర్బన్ సెంటర్ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ మారడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ డీఎమ్‌హెచ్‌వో, ఆరోగ్య శాఖ అధికారులు నీలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారులంతా ఒకటిన్నర నెల వయసున్న వారేనని అధికారులు చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: