Advertisements

బాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు పై విరుచుకపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్జ్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర స్థాయి లో కామెంట్స్ చేశారు. గతంలో జరిగిన ఓటుకు నోటు కేసుని మరోసారి వెలికి తీశారు.. డేటా చోరీ వివాదం పై మాట్లాడుతూ ఐటీ గ్రిడ్స్ సేవ మిత్రా ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు విషయంలో సీఎం చంద్రబాబు హస్తం మరోసారి బయట పడిందన్నారు. కేసుకి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చిందన్నారు.. ఆ వీడియోలో చంద్రబాబు సెబాస్టియన్ తో చర్చలు జరిపినట్టుగా ఉందన్నారు.. ఆ వీడియోని ఒక మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది అన్నారు . 5కోట్లరూపాయలకు సంబంధించిన లావాదేవీలపై జరిగిన సంభాషణలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు.

ఫార్మ్ 7 పేరుతో ఓట్ల తొలగింపు అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని కోరారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. ఫార్మ్ 7 తో డూప్లికేట్ ఓట్ల తొలగింపుకు ఎవరైనా అప్లై చేయవచ్చు. సేవమిత్ర పేరుతో ఓటర్ల డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులు హ్యాక్ చేశారు. సేవ మిత్ర యాప్ లో ఓటర్ల డేటాతో పాటు ప్రజల బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.

ఐటీ గ్రిడ్ సంస్థ యజమానికి ఏపీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డేటా చోరీ కేసులో సిట్ విచారణలో పూర్తి వివరాలు వెల్లడించాలి. ప్రజల డేటా దొంగలించనప్పుడు విచారణకు ఏపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది. చంద్రబాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సందించారు. కృష్ణా జిల్లా సమర శంఖారావం సభను ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నాం అని ఆయన ప్రకటించారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: