జగన్ కి మోసం చేయడం.. పుట్టుక తో వచ్చిన బుద్ధి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అమరావతి లో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకపడ్డారు. డేటా చోరీ వివాదం పై ఆయన స్పందించారు. జగన్ ఫారం 7 ని దుర్వినియోగం చేస్తున్నాడని అలా కనుక చేస్తీ మేము కూడా తగ్గేది లేదని దీనిని అడ్డుకోడానికి మేము కూడా తగినంత కృషి చేస్తామని ఆయన హెచ్చరించారు. లెక్కలతో సహా ఆధారాలు ఉన్నాయంటు ఆయన చెప్పుకొచ్చారు. మీ బుద్ధికి తగ్గ శుద్ధి చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ కృష్ణాజిల్లాలో 95175 ఓట్లు తొలగించడానికి వైసీపీ కుట్ర చేసిందని ఫామ్ 7 ని దుర్వినియోగం చేసారని జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేసాము..ఓటు హక్కుని కాలరాసే ప్రయత్నం ఫామ్ 7 ద్వారా జగన్ చేస్తున్నాడు.. వాస్తవాలు ప్రజలకి తెలియకుండా సొంత మీడియా ద్వారా కప్పుపుచ్చేప్రయత్నం చేస్తున్నాడు.. మీ కార్యకర్తల ద్వారా ఒక్కొక్కరి పేరు మీద 60 నుంచి 100 ఓట్లు తొలగించడానికి ఫామ్ 7 ని ఉపయోగిస్తున్నారు.. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఏ పార్టీ అధ్యక్షుడు కి రాలేదు…

2018 ఎన్నికల్లో కేసిఆర్ కూడా ఓట్లు తొలగించే గెలిచాడు…తెలంగాణ ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు కంప్లైంట్ లు చేస్తే అధికారులు సారి చెప్పి చేతులు దులుపుకున్నారు… ఓట్లు తొలగించే కుట్ర కేసీఆర్ చేస్తే…. దానిని జగన్ అమలు చేస్తున్నాడు..
పూర్వం పెద్దలు చెప్పేవారు పుట్టుకతో వచ్చిన ఆలోచనలు ఎప్పటికి పోవు అని చిన్నప్పుడే పదవతరగతి ప్రశ్న పత్రం దొంగిలించిన మోసపురితా బుద్ధి జగన్ ది… టెలిఫోన్ కుంభకోణంలో మీ బావ అనిల్ కుమార్ ఉన్నమాట వాస్తవం కాదా?… విజయవాడ కమిషనర్ కి మరియు కృష్ణ జిల్లా ఎస్పీ ని.కూడా కలిసి పిర్యాదు చేస్తాం..ఎక్కడ అయితే ఫామ్ 7 ని ఉపయోగిస్తున్నారో..ఆ ఐపీ అడ్రెస్ ద్వారా నిందుతులని కనిపెట్టి చర్యలు తీసుకుంటాం అని కలెక్టర్ హామీ ఇచ్చారు…నా సొంత మైలవరం నియోజకవర్గంలో నే 7141 తొలగించే ప్రయత్నం చేశారు..

Share.

Comments are closed.

%d bloggers like this: