చింత లేకుండా.. ఫేస్‌బుక్‌ వాడండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ వ్యాపార వేత్త.. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కొన్ని నెలలుగా సంభాషణలు లీక్ అవుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. దీనికి గట్టి జవాబుతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. దీని వెనక ఉన్న శాస్త్ర సంక్షిప్త లోపాలను తెలుసుకున్నాడు. ఇక పై ఎటువంటి సంబాషణాలు కూడా లీక్ అవ్వవంటూ గట్టి సమాదానం తో ఆయన ముందుకొచ్చారు. ఫేస్‌బుక్‌ కి విప్లవాత్మక మార్పులు చేయాడానికి నిశ్చయించుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా జ‌రిగే సంభాష‌ణ‌లు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాల‌ని ఆ సంస్థ ఆలోచిస్తున్న‌ది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఈ తాజా ఐడియాను త‌న బ్లాగ్‌లో పోస్టు చేశాడు. సుర‌క్షిత‌మైన‌ ప్రైవేటు మెసేజ్ స‌ర్వీసులు భ‌విష్య‌త్తులో మ‌రింత పాపుల‌ర్ అవుతాయ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ అంచ‌నా వేస్తున్నాడు. ఓపెన్ ఫ్లాట్‌ఫామ్‌ల క‌న్నా.. ప్రైవ‌సీ ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఫేస్‌బుక్‌కు చెందిన న్యూస్‌ఫీడ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గురించి కానీ జుక‌ర్‌బ‌ర్గ్ ఎటువంటి నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించ‌లేదు. భ‌విష్య‌త్తులో యూజ‌ర్లు ప్రైవ‌సీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల‌తో క‌మ్యూనికేట్ చేసుకుంటార‌ని తెలిపాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: