కైలీ జెన్నర్ వయసు 20 మాత్రమే.. ఈమె తన జీవితం లో ఇప్పటికే ఒక తల్లి, ఒక వ్యాపార వేత్త.. ఒక మోడల్.. ఒక యాక్టర్.. ఒక అందగత్తే.. అన్నిటికన్నా మించి ఒక బిలియనేర్. 20 ఏళ్ల వయసులో 6 వేల కోట్లకి పాయినే అధిపతి, సంవత్సరానికి దాదాపుగా 900 మిలియన్ డాలర్ల సంపాదన..! 20 ఏళ్లకే ఫోర్బ్స్ మాగ్జైన్ లో చోటు సంపాదించుకుంది. అతి తక్కువ వయసులో బిలియనేర్ గా నిలిచింది..! అసలు ఎవరీ కాలీ జెన్నర్.. ? ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగింది..? అని ప్రశ్నలొస్తున్నాయి కదా..
కాలీ జెన్నర్ ఈమె ఒక అమెర్కన్ మోడల్.. స్వయంకృషితో చిన్నవయసులోనే తిరుగులేని సంపాదనతో ప్రపంచ దృష్టిని తనవైపే తిప్పుకుంది. వారసత్వపు ఆస్తి లేదు.. కర్దాషియన్ ఫ్యామిలీ కి చెందిన మోడల్ అని ఒక గుర్తింపు ఉంది. ఇక ముందు మోడల్ గా అడుగు పెట్టిన ఈమె తన అందంతో క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ క్రేజ్ ని క్యాష్ ఇన్ చేసుకుంది. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్. యూత్ బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్ పేరిట ఓ స్టార్టప్ మొదలుపెట్టగా.. అది కాస్త 630 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ‘హండ్రెడ్ పర్సంట్’ పేరిట లిప్ కిట్.. 29 డాలర్లకు కిట్ అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి.. రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది. గత సంవత్సరం కైలీ గర్భం దాల్చి ఒక శిశువుకి కూడా జన్మ నిచ్చింది.. ఇలా సక్సెస్ఫుల్ గా ఉన్న కైలి దాదాపుగా సంవత్సరానికి 900 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది అది కూడా ట్యాక్స్ మినహాయించిన తరువాతే..!
ఇలా కైలీ అతి చిన్న వయసులో అది కూడా 20 ఏళ్లకే బిలియనేర్ లిస్ట్ లో చోటు సంపాదించింది. ఇది వరకు ఈ లిస్ట్ లో ఫేస్-బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 23 ఏళ్ళు ఉన్నపుడు లిస్ట్ లో చోటు చేసుకున్నాడు. ఇక 23 ఏళ్ళకంటే ముందే చోటు దక్కించుకున్న కైలీ రికార్డ్ సృష్టించింది. గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.