పబ్జి గేమ్ గురించి కొత్తగా ఏం చెప్పకర్లేదు.. చిన్నారుల నుండి పండు ముసలి వరకు ఈ గేమ్ ఆడుతున్నారు. ఎవ్వరిని చూసిన తల ఫోన్ లో నిమగణం చేసి ఉంటునారు.. ఏం చేస్తున్నావ్ అంటే తక్కు మని పబ్జి ఆడుతున్న అని సమాధానాలు వస్తున్నాయి. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఫోన్ లో మునిగిపోతున్నారు ఈకాలం యువతరం. ఏదో కాలక్షేపం గురించి ఒక పావు గంటో అర్ధ గంటో గేమ్స్ ఆడుతారు కానీ పబ్జి వచ్చినప్పటినుండి గంటల తరబడి ఫోన్ ల పైన ఉంటున్నారు జనం.
ఈ పబ్జి గేమ్ ల వల్ల యువత లో మెదస్సు లోపం మతిమరుపు వంటి సూచనలు కనపడుతున్నాయి. కూని సార్లు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యి సిల్లీ రీసన్స్ కి ఒకరి పై ఒకరు దాడులకి కూడా పాల్పడుతున్నారు. పబ్జి గేమ్ ఆడుతూ నిజంగానే మర్డర్లు సైతం చేస్తున్నారు ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. పబ్జి గేమ్ పై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేదం ప్రకటించాయి. అయితే ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ఒక వ్యక్తి పబ్జి ఆడుతూ మంచి నీరు అనుకోని పక్కనున్న యాసిడ్ తాగేశాడు. ఇలా ఉంది పబ్జి మహిమా..!
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని కింద్వారాలో 25 ఏళ్ల వ్యక్తి ఒకరు పబ్జి గేమ్ ఆడుతూ నీళ్లనుకొని, యాసిడ్ తాగేశాడు. ఈమద్యే అతనికి పెళ్లి కూడా అయింది. ఇప్పుడు తనకో కూతురు కూడా ఉంది. ఇంట్లోని పెరటిలో పబ్జి గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. అతనికి పక్కనే యాసిడ్ బాటిల్ ఉంది. ఈ విషయాన్ని అతను గమనించలేదు. గేమ్‌లో లీనమైన అతను అనుకోకుండా యాసిడ్‌ను నీళ్లనుకొని తాగేశాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కొద్ది రోజులకి అతను తేలికపాటిగా కోలుకున్నాడు. పూర్తిగా కోలుకోకముందే కుటుంబ సభ్యులు అతనిని ఇంటికి తీసుకెలిపోయారు. ఇంటికెళ్ళినపటినుండి ఆ వ్యక్తి ఏం తిన్న వాంతులు.. ఇక మళ్ళీ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా తనకి ఆపరేషన్ చేశారు.. చివరి అంచుల వరకు వెళ్ళిన అతను ఇప్పుడు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఈ వార్తా జరిగి కొన్ని రోజులు అయినప్పటికి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.