గురువారం మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డేటా చోరీతో పాటూ తాజా పరిణామాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేయడమే కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్టా.. అని ప్రశ్నించారు చంద్రబాబు. తెలంగాణకు మెరుగైన పాలన అందించాల్సిందిపోయి.. ఏపీలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అండగా ఉన్న తనను దెబ్బతీసి.. రాష్ట్రానికి దిక్కులేకుండా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం తన పోరాటాన్ని కొననాగిస్తానన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. డేటా చోరీతో పాటూ తాజా పరిణామాలపై స్పందించారు.
ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొచ్చి బీహార్‌లా డెకాయిట్ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో కూడా బీహార్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని.. రాష్ట్రంలో వాళ్ల ఆటలు సాగవన్నారు. రౌడీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే సమాజం నష్టపోతుందని ఆయన అన్నారు.