భువనగిరి లో కేటీఆర్ స్పీచ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి పట్టణంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో 2 సీట్స్ కోల్పోయాము. మునుగోడు, నకిరేకల్లో ఓడిపోయాము. ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోవాలి. జనగామ, ఆలేరులో ఇంకా మెజారిటీ రావాల్సి ఉంది తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో స్వల్ప తేడా తో గెలిచాము. సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చాము, అన్ని పార్టీ లకు ఇచ్చాము. అన్ని చెరువులు నింపాము కానీ ఓడిపోయాము.

మన యాదాద్రి కి నిధులు కేటాయించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 2000 కోట్లు కేటాయించారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. తాండలు గ్రామపంచాయతీలుగా మారాయి. హైద్రాబాద్ ఫార్మాస్యూటికల్ క్లస్టర్ త్వరలో ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు కాబోతుంది. ఇక రహదారుల విషయానికొస్తే.. జాతీయ రహదారులు గతంలో 29 కిలోమీటర్ల ఉంటే ప్రస్తుతం 524 కిలోమీటర్లు జాతీయ రహదారులు వచ్చాయి. డ్రై పోర్ట్ నకిరేకల్ లో ఏర్పాటు చేయబోతున్నాం. ఎం‌ఎం‌టి‌ఎస్ రైలు హైద్రాబాద్ నుండి రాయగిరి వరకు రాబోతుంది.ఇలా ఎన్నో పథకాలు అమలు లోకి రాబోతున్నాయి.

మూసి, గోదావరి, కృష్ణ నదుల సంగమం భువనగిరి. సాగునీటి ప్రాజెక్టు ద్వారా 9 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రుద్రమ జలాశయం ఏర్పాటు చేస్తాం. 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. మోడీ 5 సంవత్సరాల పాలన తరువాత దేశానికి చేసింది శూన్యం. రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలను గెలిచుకోవాలి. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది టీఆర్ ఎస్ పార్టీ కావాలి. అందుకు 16 సీట్లు గెలవాలి. అప్పుడు హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాదా..? మన సాగునీటి ప్రాజెక్టు కు ఒక దానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే….మోడీ ఇవ్వలేదు… అందుకే 16 పార్లమెంట్ సీట్లు గెలవాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: