నేడే.. సుప్రీం బెంచ్ పైకి అయోధ్యా వివాదం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

60 ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్యా రామ్ మందిర్ బాబ్రీ మసీద్ వివాదం పై నేడు సుప్రీం కోర్ట్ తీర్పునివ్వనుంది. ఐదు గురు జడ్జీలు గల బెంచ్ ఈ వివాదం పై మధ్యవర్తికి ఇవ్వాలో వొద్దో ఒకవేళ ఇస్తే ఒకరికా లేక పలువురికా అన్న రీతిలో తీర్పు ఇవ్వనుంది. ఈ ఐదుగురి జడ్జీలని లీడ్ చేస్తుంది జస్టిస్ రంజన్ గొగొయ్, ఇక జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లు బెంచ్ సభ్యులు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని సుప్రీం వ్యాఖ్యానించింది.

మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం బుధవారం పేర్కొంది. గతాన్ని ఎలాగో మార్చలేము, ఆ స్థలం ఎవరిదీ..? దానికి ఎవరు రాజు..? అసలు అది ఆలాయమా లేక మసీదా అనే అంశాలను ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేము, అదంతా గతం.. ప్రస్తుత పరిణామాలని పరిగణలోకి తీసుకొని సామరస్యంగా దాన్ని పరిష్కరించే రీతిలో తీర్పు ఇవ్వడానికి చూస్తాం అని జస్టిస్ రంజన్ గొగొయ్ పేర్కొన్నారు. ఇక మధ్యవర్తి హోదా ఒక్కరికా పలువురికా అనే అంశాని చర్చించి ఆపై తీర్పు ఇస్తాము అని జస్టిస్ బొబ్దే అన్నారు.

గతాన్ని మనం మార్చలేమని, ఎవరు కూల్చారు.. ఎవరు రాజు.. ఆలయమా.. మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని, ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటామని, దాన్ని పరిష్కరించాలని చూస్తామని జస్టిస్ రంజన్ గొగొయ్ వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నామని జస్టిస్‌ బోబ్డే పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: