టీడీపీ లోకి మరో మంత్రి వారసుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి..ఎన్నికలు దేగ్గరగా వస్తున్నప్పటికీ నేతలు పార్టీ కండువాలు మార్చుకుంటునే ఉన్నారు. కొత్త నేతలు పార్టీలోకి వస్తున్నారు పాత నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ లోకి వలసలు కడుతున్నారు. ఇక టీడీపీ దీ అదే పరిస్తితి. ఈ సంధర్భంగా నేడు ఉదయం టీడీపీ లోకి మాజీ ఎమ్మెల్యే జయరామ్ కుమారుడు రామ్మోహన్ చంద్రబాబు సమక్షం లో టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు.

జయరామ్ గతంలో తెలుగు దేశం పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. సినీనటుడు చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి జంప్ చేశారు. ప్రజా రాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి.. ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కుమారుడు రామ్మోహన్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం చిత్త శుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా రామ్మోహన్ కి చంద్రబాబు సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: