హైదరాబాద్ లో అవాంచిత్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతుంది. సాధారణంగా నిప్పు అంటేనే మనం బయపడతాము అలాంటిది. ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా నడి రోడ్డు పైకి వచ్చి కిరోసిన్ పోసుకుని తనకి తాను నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యా యత్నానికి ఆయన పాల్పడ్డారు. ఆ దృశ్యాలు చూస్తున్న జనం భయంతో పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌లోని స్నేహపురి కాలనీకి చెందిన వెంకటేశ్ గుప్తా అనే వ్యక్తి నేడు ఉదయం రోడ్డు పైకి వచ్చి అందరి ముందు కిరోసిన్ పోస్య్కుని నిప్పంటించ్కున్నాడు. ఈ దృశ్యాలు చూసిన జనం భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. పక్కనే ఉన్న సీసీ టివి లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతు దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ఆ వ్యక్తి ఆత్మహత్యకి గల కారణాలని ఆరా తీస్తున్నారు. కాగా వ్యాపారం నష్టపోవడం వల్లే వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడట్టు భావిస్తున్నారు.