మహిళలకి ‘బాబు’ పథకాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉండవల్లి లో ప్రజావేధిక ఏర్పాటు చేసింది. ఈ వేధికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం మహిళలకి కల్పించిన సంక్షేమాలనీ పథకాలని ఆయన తన ప్రసంగం లో వెల్లడించారు..

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

మహిళా రిజర్వేషన్ల కోసం నాడు ఎన్టీఆర్ ఇవాళ నేను కృషి చేస్తున్నాం. విద్యారంగంలో మహిళలకు ప్రాధాన్యం కోసం తిరుపతిలో మహిళా యూనివర్సిటీ టిడిపి ఏర్పాటు చేసింది. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే..

డ్వాక్రా సంఘాలు పెట్టి పేదరిక నిర్మూలన కోసం సంకల్పం తీసుకున్నాను. మనదేశంలో డ్వాక్రా సంఘాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాను. స్వయం సహాయక బృందాల సభ్యులకు పసుపు-కుంకుమ ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశాం.. ఫిబ్రవరిలో మొదటి విడతగా పసుపు-కుంకుమ కింద రూ. పదివేలలో 2,500 ఇచ్చాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ రూ. 3,500 ఇచ్చాం.

నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెయిరీని ప్రారంభించాను.. రోజూ రెండు గంటలు డెయిరీలో పనిచేశాను. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, ఆపై మంత్రి అయ్యాక భార్యకు నా వ్యాపారాన్ని అప్పగించాను.. ఈరోజు ఆ కంపెనీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నా భార్య, కోడలు వ్యాపారం చూసుకుంటుంటే, నేను, లోకేశ్ రాజకీయాలలో ఉన్నాం..

రాష్ట్రంలో 42,770 అంగన్ వాడీలున్నాయి.. వారికి 4,500 జీతం ఉంటే 5 ఏళ్ళలో రూ.10,500 కు పెంచాం.. మహిళల్లో రక్తహీనత పెద్ద అనారోగ్య సమస్య. అన్న అమృత హస్తంతో ఒక్కపూట అయినా మంచి భోజనం పెట్టాలని అనుకున్నాం. గర్భిణుల ముచ్చట తీర్చడానికి సామూహిక శ్రీమంతాలు.. మాతృమూర్తులను గౌరవించే కార్యక్రమాలు నిర్వహించాం.

మహిళలకోసం రక్ష పథకం కింద 120 కోట్ల వ్యయంతో శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చాం. మహిళల హక్కులు కాపాడేందుకు మహిళా కమిషన్ వేశాం. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలుంటారంటారు. కానీ తల్లిదండ్రులను గౌరవించడం లేదు. అందుకే తల్లి దండ్రులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం తీసుకొచ్చాం.. తల్లి దండ్రులు అప్పుజేసి, పెళ్లిళ్లప్పుడు ఆడపిల్లలను విసుక్కుంటారు. చంద్రన్న పెళ్లికానుకలు తెచ్చాం.

ఎన్టీఆర్ భరోసా.. కన్నబిడ్డలు బాగా చూసుకోకున్నా మీ పెద్ద కొడుకుగా ఆదుకుంటానని చెప్పి ఎన్టీఆర్ భరోసాతో పెన్షన్లు ఇచ్చాం. అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: