అసత్యాలు మాని.. చర్చలకి రండి.. తేల్చుకుందాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత రెండు మూడు రోజులుగా ఏ‌పీ ప్రభుత్వం తెలంగాణ పై మాట దాడి చేస్తుంది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి భారీగా బాకాయిలు రావాలని ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఏపీ కి తెలంగాణ విధ్యుత్ తరఫున దాదాపుగా 5000 కోట్లు బకాయిలు రావాల్సినట్టుగా ఏపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించారు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఏండీ ప్రభాకర్ రావు.

ఆయన మాట్లాడుతూ.. ‘గత రెండు, మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రభుత్వం 5 వేలకోట్లు ఏపీకీ బకాయిలు ఉన్నదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు పూర్తి అవాస్తవం, దీనిని మేము ఖండిస్తున్నాం. మాకు వాల్లు ఇవ్వాల్సింది పోయి…మేమే ఇవ్వాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. అన్ని లెక్కలు చూసుకున్న తరువాతే వాల్లు మాకు 2400 కోట్లు ఇవ్వాలి. అన్నీ లెక్కలు చూసుకుందామని చాలా సార్లు ఏపీ విధ్యుత్ సంస్థలకు లేఖలు కూడా రాసాం.

ఎన్ని లేఖలు రాసిన వారినుండి ఎటువంటి స్పంధన రాలేదు. సమాచార లోపం వల్లే ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇలా మాట్లాడారని అనుకుంటుంన్నాం. ఏం జరిగినా తెలంగాణ మీద నిందమోపడం వాళ్ళకి అలవాటైపోయింది… ఈ సమస్యను 24 గంటల్లో పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటుంన్నాం..వాల్లు దీనికి ముందు కు వస్తే బాగుంటుంది.

ఇప్పటికే 2400 కోట్లు ఏపీ మాకు ఇవ్వాలి. అన్ని లెక్కలు చేస్తే ఇంకో 11 వందల కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు విమర్శించే ముందు. అది సరైన సమాచారమో, కాదో తెలుసుకుంటె మంచింది అని వారికి తెలియజేస్తున్నాం. చర్చలకు రండీ.. ఏవరికి ఏవరు బకాయిలు ఉన్నారో తేల్చుకుందాం. ఏవరు బకాయిలు ఉంటె వారు చెల్లిస్తారు…కావాలనే ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: