భారత ఎయిర్ ఫోర్స్ కి చందిన మిగ్ 21 ఫైటర్ జెట్ నేడు కుప్పకూలింది. అది కూడా కేవలం ఒక పక్షి ఢీకొనడంతో..! పక్షి యుద్ద విమానాన్ని ఢీకొంటే.. నిస్సందేహంగా పక్షే కదా పోవాల్సింది కానీ విడ్డూరంగా యుద్ద విమానం కుప్పకూలింది.. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పైలట్ ఫ్రాణాలతో భయటపడ్డాడు.. ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. ఫ్లైట్ కుప్పకూలే ముందే పైలట్ విమానం నుండి బయటపడ్డాడు.
రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభాసర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌కు మిగ్-21ను తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శిక్షణ లో భాగంగా ఈ ఘటన జరగడం గమనార్హం. పక్షి ఢీకొనడంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మిగ్ విమానాలను భారత్ సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేశారు. 2006లో వీటిని మిగ్-21 బైసన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇదివరకు జరిగిన సర్జికల్ స్త్రీక్స్ లో భారత ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ విమానాన్నే ఉపయోగించింది. మొన్న భారత్ లోకి చొరబడ్డ పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16 ని సైతం మిగ్ 21 విమానమే తరిమి కొట్టింది. అటువంటి విమానం ఇలా పక్షి ధీకొంటే కుప్పకూలడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.