ఆస్ట్రేలియా మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ పై సిరీస్ ని ప్రకటించిన ఆస్ట్రేలియా.. భారత్ కి వచ్చి ఇప్పటికే 3 టి 20 మ్యాచ్లలో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. టీ-20 సీరీస్ అనంతరం వన్డే ఆటలు నడుస్తున్నాయి ఈ ఐదు వన్డే మ్యాచ్ల సీరీస్ లో ఇప్పటికే భారత్ వరుసగా రెండిటికి రెండు మ్యాచ్ లు గెలిచి ముందంజలో ఉంది. ఇక నేడు మూడవ మ్యాచ్ కోనసాగుతుంది. ఈ మ్యాచ్ జే‌ఎస్‌సి‌ఏ స్టేడియం రాంచిలో జరుగుతుంది. ముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ని ఎంచుకుని రంగం లోకి దిగింది.

మంచి ఫామ్ లో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదార్శన చూపలేదనే చెప్పాలి.. ఎందుకంటే మ్యాచ్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసేసరికి 313 రన్లు చేసింది. 313 రాన్లు చేసిన ఆస్ట్రేలియా కేవలం 4 వికట్లనే కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెనర్లు ఇద్దరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించారు.. అందులో ఊసమన్ ఖవాజ 113 బంతుల్లో 104 రాన్లు చేశాడు ఇందులో 11 ఫోర్లు 1 సిక్సర్ బాదాడు.. ఇక ఓపెనర్లలో ఒకరైనా ఏరోన్ ఫించ్ ఆస్ట్రేలియన్ సారధి 99 బంతుల్లో 93 పరుగులు సాధించాడు ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన విద్వాంసకర బ్యాట్స్మెన్ ఫించ్ ఈ మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి రవొచ్చు అనే చెప్పాలి.. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే బౌలర్లెవ్వరూ అంత మంచిగా ప్రదర్శన చేయలేకపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం కుల్దీప్ యాదవ్ ఒక్కడే 3 వికట్లు తీయగా షమీ 1 వికెట్ తీశాడు. మిగితా బౌలర్లు విఫలమయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: