ఈసారి లోకేష్ కి ‘కంచుకోట’ టికెట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు లోకేష్ కి టీడీపీ కంచుకోట అయిన భీమిలి టికెట్ ఇస్తున్నారనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చేర్చనీయాంశం. అక్కడ నుండి లోకేష్ పోటీ చేస్తే తప్పకుండ గెలుస్తారనే నమ్మకం తోనే బాబు లోకేష్ కి ఈ టికెట్ ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు విశాఖ జిల్లా నేతలతో జరిగిన సమీక్షలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇక పోయిన సారి భీమిలి నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ని ఈసారి ఎంపీ గా పోటీ చేయించాలని టీడీపీ అదినేత భావిస్తున్నారట. ఈ విషయమై గంటా తో చర్చలు కూడా చేసినట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి లోకేష్ భీమిలి నుండి పోటీ చేస్తునట్టు క్లారిటీ వచ్చినట్టే.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో భీమిలీ నియోజకవర్గ పరిధిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగింది. పలు ఐటీ సంస్థలకు భీమిలి ప్రాంగంగా మారింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ తరహాలో మిలీనియం టవర్స్‌ నిర్మించారు. ఐఐఎంకు కూడా ఇక్కడే స్థలం కేటాయించడం విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ రూ.40 వేల కోట్ల వ్యయ అంచనాలతో డేటా సెంటర్‌ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు.

భీమిలి నియోజకవరగం తెలుగు దేశం పార్టీకీ పార్టీ ఆవిర్భావం నుండే కంచు కోట లాంటిది. పార్టీ తుది ఎన్నికల నుండి కూడా అక్కడ ద్దాదాపుగా విజయం చానెడినట్టుగా తెలుస్తుంది. 1983 కు మొదలు 2004 వరకు టీడీపీ ఇక్కడ గెలుస్తూనే ఉంది. ఇక 2004 మరియు 2009 లో ఓటమి పాలయ్యింది. మళ్ళీ 2014 లో జరిగిన ఎన్నికళ్ళఓ కూడా ఇక్కడ టీడీపీ ఘనా విజయం సాదించినట్టుగా రికార్డులు ఉన్నాయి. ఎన్‌టి‌ఆర్ సైతం భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేశారు ఇక అలాంటి స్తానమ్ నుండి లోకేష్ పోటీ చేస్తే తప్పకుండ గెలుస్తాడనే నమ్మకం తో చంద్రబాబు లోకేష్ ని అక్కడ నుండి పోటీ చేయిస్తున్నారు అని ప్రజలు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: