బాలయ్య పై పోటికీ చెమటలు కక్కుతున్న వైసీపీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనంతపురం జిల్లా ఇరు పార్టీ నేతలకు సీట్ల టెంక్షన్ తప్పట్లేదు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే రెండు పార్లమెంట్ 11 అసెంబ్లీ స్థానాలకు అధినేత పోటీ చేసే అభ్యర్థులను అధినేత ప్రకటించారు, వైసీపీ పార్టీ మాత్రం జిల్లాలో అధికారకంగా అభ్యర్థులను ప్రకటించలేదు, ఇప్పటికీ జిల్లా నేతలకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, ఎవరికి సీటు దక్కుతుందో అనేదే ఇప్పుడు అక్కడ టెంక్షన్ గా మారింది..

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవరం తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనే చెప్పాలి, ఇలాంటి నియోజకవర్గం లో టిడిపి పార్టీని ఢీ కొట్టాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా భలమైన అభ్యర్థులని నిలబెట్టాలి. అయితే అక్కడి టీడీపీ అభ్యర్థి నటుడు బాలకృష్ణ పై పోటీ చేయడానికి వైస్సార్సీపీ పార్టీకి అభ్యర్దిలే దొరకటంలేదట. గతంలో ఈ నియోజకవర్గానికి నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ పేర్లు వినిపించాయి. అయితే ఈ మధ్యనే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ నేతే రిటైర్డ్‌ పోలీసు అధికారి (ఐజీ) ఇక్బాల్‌ అహమ్మద్‌.

మైనార్టీ వర్గానికి చెందిన రిటైర్డ్‌ పోలీసు అధికారి (ఐజీ) ఇక్బాల్‌ అహమ్మద్‌ను హిందూపురం బరిలో దించితే ఎలా ఉంటుందన్న చర్చలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇక్బాల్‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి హిందూపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై చర్చించినట్టు సమాచారం. ఇక్బాల్‌ అహమ్మద్‌ కర్నూలు జిల్లా వ్యక్తి అయినా హిందూపురానికి బంధుత్వంతోపాటు పోలీస్‌ అధికారిగా పరిచయాలు ఉన్న నేపథ్యంలో తెరపైకి ఆయన పేరు వచ్చింది.

గత ఎలెక్షన్స్ 2014లో నవీన్ నిశ్చల్ పోటీ చేశారు, ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నుంచి వైస్సార్సీపీ పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీని తెరపైకి తీసుకువచ్చి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అబ్దుల్‌ ఘనీ చురుగ్గా లేకపోవడం, అనారోగ్య కారణంగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయి ఆయన హవా తగ్గడంతో మరో అభ్యర్థి పేరు తెరమీదకు వచ్చింది.

ఈ తరుణంలో హిందూపురంతో పాటు చిలమత్తూరు మండల్లాలో బలమైన మైనార్టీ కోసం అన్వేషిస్తుంది. మైనార్టీలో బలమైన అభ్యర్థిని దించాలని భావిస్తూ స్థానికంగా ఆర్థిక, అంగబలం ఉన్న వారిని రంగంలోకి దింపేందుకు పార్టీ అధినేత సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోది. ఎన్నికల షెడ్యూల్‌ సమీపిస్తున్న నేపథ్యంలో హిందూపురంలో టీడీపీని ఢీ కొట్టే వైసీపీ అభ్యర్థి కనిపించకపోవడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం ఏర్పడుతోంది. ఇక్బాల్‌ హిందూపురం వైపు మెగ్గుచూపుతారా లేక అబ్దుల్‌ ఘనీకి మొండిచేయి చూపుతారా అనే విషయం ఆదివారంలోపు ఓ కొలిక్కి వస్తుందని పార్టీలో వర్గాలు చెబుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: