గత కొద్ది రోజులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలో టీడీపీ ని విడబోతున్నారు అని కధనాలు కూడా వచ్చాయి.. అసలు ఇవన్ని వాస్తవాలెనా..? అనే ప్రశ్నకి మాత్రం అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆయన చంద్రబాబుతో ఈ విషయమై భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. పార్టీ మారాలనే తన ఆలోచనను మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు ముందు ఉంచారు. దీంతో బాబు ఆయనకి మంచి ఆఫర్ ఇచ్చారు. ఒంగోలు లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని బాబు ఆయనని కోరినప్పటికీ ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక దీంతో మాగుంట వైఎస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లే అనిపిస్తుంది.
వైసిపి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వనం రావడంతో వైసిపిలో చేరాలని ఆయన అనుచురులు ఒత్తిడి పెడుతున్నట్లు చెబుతున్నారు. టీడీపి నుంచి ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేయడానికి నిరాకరించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసిపి తరఫున మాత్రం పోటీ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, నెల్లూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు కొందరు సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. సొంత జిల్లా నెల్లూరులో గ్రూప్ రాజకీయాలు నచ్చకనే ప్రకాశం జిల్లాను తన రాజకీయాలకు క్షేత్రంగా ఎంచుకున్నారని సమాచారం. దీంతో ఆయన నెల్లూరు నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. మరో మూడు రోజుల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు.