ఏపీ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయం లో కూడా నేతలు పార్టీలు మారడం మానట్లేదు. ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి అనట్టుగా తేలిగ్గా మారిపోతున్నారు. రోజురోజుకీ ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ఇక ఇలాంటి నేపధ్యంలో నేడు మరో కీలక నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీలోకి అడుగు పెట్టారు.. ఆయనే దాసరి జై రమేష్..! టీడీపీ వ్యవస్థాపక సభ్యులు, విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ శనివారం వారం నాడు జగన్ సమక్షం లో వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా జగన్ ఆయనని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దాసరి జై రమేష్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 1998 లో విజయవాడ లోక్సభ అభ్యర్దిగా పోటీ చేసి.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్ది పర్వతనేని ఉపేంద్ర చేతిలో ఓడారు. తర్వాత కొద్దిరోజులు టీడీపీలో కొనసాగినా.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు.