మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు తన కుమారుడు రత్నాకర్ లు నేడు జగన్ ని లోటస్ పాండ్ లో కలిశారు. ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిని జగన్ సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 20 ఏళ్ల సుదీర్ఘ కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన వీరభద్రరావు 2 సార్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
మరలా 2009లో ఓటమిపాలయ్యారు ఆ తరువాత ఎంఎల్‌సి గా పదవి చేపట్టారు. 6 సంవత్సరాలు ఎంఎల్‌సి గా పని చేసి 2013 లో ఎంఎల్‌సి పదవీ కాలం ముగిసిన అనంతరం తన కుమారుడు రత్నాకర్‌తో కలసి వైసిపిలో ఈ రోజు చేరారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.
వైసీపీలో చేరిన తర్వాత దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ… చంద్రబాబుది డబుల్ టంగ్ కాదు… మల్టీ టంగ్ అన్నారు. తన లోపాలను చంద్రబాబు సరిదిద్దుకోవాలన్నారు. అలాగే జగన్‌లా సుదీర్ఘ పాదయాత్ర చేసినవారెవరూ లేరని, పాదయాత్రతో జగన్ ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.