కే‌జీఎఫ్ తరహా సినిమా రాబోతుందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మహేష్ సుకుమార్ ల సినిమా పట్టలేక్కకముందే అభిమానులకి చెదు కబురు వినిపించింది. మహేష్ అభిమానులందరూ.. సినిమా ఎప్పుడా అని ఎంతో ఉత్కంటగా ఎదురు చూసిన ఈ సినిమా కొన్ని క్రియేటివ్ విబేధాల వల్ల ఆగిపోయినట్లు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న విషయం తెలిసింది తెలిసిందే. ఇక మహేష్ ఆ ట్వీట్ తో ఈ సినిమా తీయట్లేదాని క్లారిటీ ఇచ్చేశారు. ఇక అప్పటినుండి అభిమానులందరూ మహేష్ తీయబోయే నెక్స్ట్ సినిమా ఎంటా అని ఎంతగానో వేచి చూస్తున్నారు.

ఇక ఈ సినిమా క్యాన్సిల్ అయ్యే సరికి అటు సుకుమార్ బన్నీ ని చూసుకున్నాడు.. ఇటు మహేష్ బాబు కే‌జి‌ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఈ విషయామి ప్రశాంత్ నీల్ కి మహేష్ నుండి ఫోన్ కూడా వెళ్ళినట్టు వారిద్దరు మాట్లాడుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కే‌జి‌ఎఫ్ భారీ హిట్ అవ్వడం తో మహేష్ ప్రశాంత్ కి కాల్ చేశాడని అంటున్నారు. ఇక మహేష్ కి ప్రశాంత్ మంచి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు.. ఈ మేయరకు మహేష్ భార్య తో కూడా ప్రశాంత్ స్టోరీ లైన్ గురించి చర్చినట్టు సమాచారం. ఇక ఆ కథ నమ్రతకి కూడా ఏదో నచ్చడం తో ఇక మహేష్ నెక్స్ట్ సినిమా ప్రశాంత్ తోనే అనే విషయం పై క్లారిటీ వచ్చినట్టే అని అనిపిస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు అశ్వినీ దత్ ల స్వీయ కలయికలో మహర్షి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా కనిపించనుంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మేకప్ వేసుకుంటుంది..! ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి అభిమానుల ముందుకు తేవాలని చిత్రా యూనిట్ భావిస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: