మా అధ్యక్షుడిగా నరేష్..! భారీ విజయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు పోటా పోటీగా సాగాయి.. మా ఎన్నికల్లో నటుడు నరేష్ శివాజీ రాజా తల పడ్డారు. పోటీ నువ్వా నేనా అనట్టుగా జరిగింది. పోటీ లో 69 ఓట్ల తేడాతో నరేష్ భారీ విజయం సాధించారు. మా ఎన్నికలో చరిత్రలో ఇది వరకూ ఎన్నడూ లేనట్టుగా పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ ఫిల్మ్ ఛాంబర్ లో ఈ ప్రక్రియ జరిగింది. ‘మా’లో మొత్తం 745 మంది సభ్యులుగా ఉండగా… వారిలో 472 మంది మాత్రమే ఓటు వేశారు. అయినప్పటికీ… ‘మా’ ఎన్నికల చరిత్రలో ఎక్కువ పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి.

ఇదివరకు ఈవీఎంలతో ఎన్నికలు జరపగా… ఈసారి మాత్రం బ్యాలెట్‌ పత్రాల్ని వాడారు. అందువల్ల కౌంటింగ్ లేటై… ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్నికల ఫలితాల్ని ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ గెలుపును ముందే ఊహించామంటున్న ఆర్టిస్టులు… ఫార్మాల్టీ ప్రకారం ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు.

ఎన్నికల్లో భాగంగా.. MAA జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, ట్రెజరర్‌గా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. తాను ఎలాగైనా గెలుస్తానని చెప్పుకుంటూ వచ్చిన హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం గమనార్హం. ఇక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: