మన వాళ్ళు కొట్టారు..! కానీ వాళ్ళే గెలిచారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ లు పోటాపోటిగా సాగుతున్నాయి. ప్రేక్షకులని తీవ్ర ఆసక్తికి గురి చేస్తున్నాయి. ఇరు జెట్లు ఎలాగైనా గెలవాలనే పట్టుధలని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇప్పటికే టీ-20 సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇక వన్డే మ్యాచ్ లలో భారత్ ముందు రెండు మ్యాచ్ లు అభూతంగా ఆది గెలిచారు. ఇక మూడవ మ్యాచ్ ని ఆసీస్ కొల్లగొట్టింది. ఇక మిల్గీలినవి రెండే మ్యాచ్ లు. ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్ళదే.. ఇక నిన్న నాల్గవ వన్డే మొహాలీ లో జరిగింది. కొద్ది రోజులుగా ఫామ్ కొలోయారు అనుకున్న భారత ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మాలు తిరిగి చక్కటి ఇన్నింగ్స్ అందించారు రోహిత్ 95 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 143 పరుగులు చేశాడు. అలా చక్కటి ప్రధర్శనతో టీమ్ ఇండియా 358 పరుగులు చేసింది.

ఒక పట్టాన భారత్ ఆస్ట్రేలియా కి గట్టి లక్ష్యాన్నే ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మేమేమి తక్కువ తినలేదు అన్నట్టుగా ఆడారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు..ఉస్మాన్ ఖవాజ 91 పరుగులు చేశాడు ఆపై పీటర్ హ్యాండ్స్కోంబ్ 117 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరువ చేశారు.. ఇక నిన్నటి పిచ్ కాస్త బ్యాటింగ్ కె అనుకూలించిందని చెప్పాలి.. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలింగ్ ఆస్ట్రేలియా కి చాలా అనుకూలంగా మారిపోయింది.. ఇక ఎవ్వరూ ఊహించని రీతిలో ఆస్టన్ టర్నర్ 43 బంతుల్లో 84 పరుగులు చేశాడు అందులో 5 ఫోర్లు 6 సిక్సర్లతో భారత బౌలర్లకి ఓ దిశలో చుక్కలు చూపించాడు. ఇక తన ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా గెలుపు అందుకుంది.. భారత ఆటగాళ్లు ఎన్నడూ లీని విధంగా ప్రెషర్ కి గురయినట్టు కనిపించారు కేవలం టర్నర్ ఒక్కడివే 3 క్యాచ్ లు వదిలేశారు.. ఇక అంతే టర్నర్ సిక్సర్లు ఫోర్లు ఆస్ట్రేలియా గెలుపికి కారణాలయ్యాయి. ఇక ఈ విజయంతో భారత్ ఆస్ట్రేలియా లు 2-2 సంఖ్యలతో సిరీస్ నీదా నాదా అన్నట్టుగా ఉన్నారు ఇంకా కేవలం ఒకే మ్యాచ్ మిగిలుంది.. ఎవ్వరూ గెలిస్తే సిరీస్ వాళ్ళదే.

Share.

Comments are closed.

%d bloggers like this: