తెర పైకి నయీమ్ గ్యాంగ్..! ఈసారి నయీమ్ భార్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భువనగిరి నుండి మొదలుకొని దేశ వ్యాప్తంగా అక్రమాలకి పాల్పడ్డాడు నయీమ్.. ‘నయీమ్’ ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు అక్రమాలు.. అఘాయిత్యాలు. ఇలా అక్రమాలు చేసి భారీ ఎత్తున గ్యాంగ్ సంపాదించుకున్నాడు నయీమ్.. ఈ గ్యాంగ్ కి ఓ పేరు కూడా ఉంది ఎన్ గ్యాంగ్ . పొరపాటున నయీమ్ కన్ను ఏదైయన భూమి మీద పాడిందంటే చాలు ఇక ఆ భూముల యజమానులు వాటిని వాదులుకోక తప్పదు ఇలా నయీమ్ చాలా కాలం అనేక మండి జనాన్ని బయపెట్టించి అక్రమాలకి పాల్పడ్డాడు చివరికి తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్-కౌంటర్ అయ్యాడు. అతను మరణించిన తరువాత కూడా ఎన్ గ్యాంగ్ అక్రమాలకి పాల్పడుతూనే ఉంది. పోలీసులు ఈ ఎన్ గ్యాంగ్ సభ్యులని ఎంతమందిని పట్టుకున్న మళ్ళీ ఎక్కడూ వీళ్ళు పుడుతునే ఉన్నారు.. అక్రమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నయీమ్ భార్య హసీన్ బేగం కూడా నయీమ్ మాదిరిగానే అక్రమాలకి పాల్పడుతుందని కథనాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఎన్ గ్యాంగ్ సాభ్యులు మళ్ళీ తెరపైకి వచ్చారు. ఎన్ గ్యాంగ్ సభ్యుడు నయీమ్ భార్య ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ నయీమ్ భార్య హసీన్ బేగం సూచన మేరకు భువనగిరి టౌన్ డివిఆర్ ఎస్టేట్ లోని 5 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నం చేశాడు. అంతే కాకుండా నయిమ్ బినామీ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నం చేశాడు. దీనికి కొంత మంది పోలీసులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా సహకరించినట్టు సమాచారం వస్తుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఈ సమాచారం పై విచారణ చేశారు. విచారణలో భాగంగా తుమ్మ శ్రీనివాస్ తో పాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 88. 37లక్షల నగదు, బంగారం, మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎస్వోటి అడిషనల్ డీసీపీ సురేందర్ మెడియ ముందు వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: