Advertisements

ఉగ్ర నిర్మూలనలో 18 మందిని హంతం చేశాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ ఉగ్ర దాడుల నేపధ్యంలో మన జవాన్లు 45 మంది ప్రాణాలు వీడారు. ఇక అప్పటినుండి భారత ఆర్మీ తీవ్ర ప్రతీకారా వాంఛతో ఉన్నారు. ఇక అప్పటినుండి కనిపించిన తీవ్రవాదులు అందరినీ ఎన్ కౌంటర్ చేసేస్తున్నారు. ఎక్కడైతే తీవ్ర వాదులు ఉన్నారు అని సమాచారం వచ్చిందో.. అక్కడ ముమ్మరంగా గాలిస్తున్నారు సి‌ఆర్‌పి‌ఎఫ్ కమండర్లు. ప్రతీ ఇంటినీ ప్రతీ వాడని జల్లడ పడుతున్నారు. కేవలం 21 రోజుల్లో 18 మంది ఉగ్ర వాదులని హతమార్చారు.

కొంచం అనుమానాస్పదం వ్యక్తమయిన అక్కడ వాలిపోతున్నారు సి‌ఆర్‌పి‌ఎఫ్ కమాండర్లు. కాశ్మీర్‌లో భద్రతను పటిష్టం చేయడమే వీరు ముఖ్య లక్ష్యంగా భావిస్తున్నారు. ఎల్‌వోసీ సరిహద్దు గ్రామాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చేపడుతున్నారు. కనిపించిన ప్రతీ ఉగ్రవాదిని హతమారుస్తున్నారు దీంతో ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడుతున్నాయి.

ఇలా భారత సైన్యం ఎంకౌంటర్ చేసిన 18 మంది లో 14 మంది జైషే మహమ్మద్ కి చండిన తీవ్రవాదులు. అందులో 6 గురు మాత్రం జైషే కమాండర్లు ఉండగా పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ రెండో కమాండర్ ముదాసిర్‌ అహ్మద్ ఖాన్‌ను కూడా హంతం చేసినట్టు భారత ఆర్మీ పేర్కొంది.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: