ఇక రాధా సైకిల్ ఎక్కడం పక్కా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా తన వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని వీడిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గత నెల రోజులుగా ఈ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. ఆయన ఎప్పుడు చేరబోతున్నారు అనే దాని పై కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. రాధా పార్టీని వీడినప్పటినుండి దాదాపుగా నేటికి నెల రోజులు వరకు అయ్యుంటుంది కానీ ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి సరిగ్గా నేటి తో ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇక ఆయన పార్టీలో చేరకపోతే ఆయనకే నష్టం వాటిల్లుతుందని అక్కడి జనం అనుకుంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గత రెండు మూడు రోజుల నుండి ఆయన మళ్ళీ తెర పై కనిపిస్తున్నాడు. నిన్న సాయంత్రం ఆయన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ భేటీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇది ఇలా ఉండగా ఉన్నట్టుండి మళ్ళీ సోమవారం రాత్రి వంగవీటి రాధా విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో రాధా చంద్రబాబు తో తన డిమాండ్లని చెప్పుకునట్టు దానికి బాబు ఒప్పుకునట్టు సమాచారం వస్తుంది. రాధా కి చంద్రబాబు నర్సారావుపేట లేదా అనకాపల్లి టికెట్ ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. దీంతో రాధా మరో వారం రోజుల్లో చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరడం పక్కా అంటున్నారు టీడీపీ నాయకులు.

Share.

Comments are closed.

%d bloggers like this: