త్వరలో సైకిల్ ఎక్కనున్న జేడీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జగన్ అక్రమాస్తుల కేసులో దూకుడా విచారణ చేసిన జేడీ లక్ష్మి నారాయణ రెండు రాష్ట్రాల ప్రజలకి సన్నిహితుడే.. అయితే జేడీ స్వచ్ఛందంగా ఆయన పదవికీ రాజీనామా చేశారు, అనంతరం రాజకీయాల్లోకి వద్దామని ఆయన నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేయరకు ఆయన ఇప్పటికే అన్నీ రాష్ట్రాలని చుట్టేశాడు.. రైతులనీ విధ్యార్ధులని.. కలిసి వారి కష్టాలను తేలేఊసుకున్నాడు.. జిల్లా వారీగా భేటీలు నిర్వహించారు. ఒక పట్టాన జనం అంతా ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నాడని నమ్మేశారు.

కానీ ఆలా చేయకుండా టీడీపీ లో చేరబోతున్నారని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. గత కొంత కాలంగా ఆయన మీద చాలా వార్తలు వస్తున్నాయి. ఆయన లోకసత్తా లో చేరుతున్నారని ఇందుకు జయప్రకాశ్ నారాయణ‌తో చర్చలు జరుపుతున్నారని, మరో పక్క జనసేన లో చేరుతున్నారని ఆయన మీద అనేక వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వీటన్నిటికీ అనుగూనంగా టీడీపీ లో చేరుతునట్టు వార్తలొస్తున్నాయి. టీడీపీ పార్టీ నుండి ఆయన భీమిలి నుంచి పోటీలోకి దిగుతారని గట్టి ప్రచారం నడుస్తుంది.

మొన్నటివరకు భీమిలి నుండి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ భీమిలి నుండి పోటీ చేయబోతున్నారని కూడా కథనాలు వచ్చాయి. కానీ బాబు ఇప్పుడు మనసు మార్చుకొని ఆ స్థానాన్ని జేడీ కి భీమిలి టికెట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే లోకేష్ ని విశాఖ ఉత్తరం నుండి పోటీ చేయిస్తున్నారని మరో ప్రచారం. ఇక ఈ మ్యాటర్ ని సెట్ చేసేందుకు బాబు గంట శ్రీనివాస్ ని రంగం లోకి దింపారు.. జేడీ ని హైదరబాద్ లో కలిసిన గంటా ఆయనతో చర్చలు జరిపారని ఇందుకు గాను జేడీ ఒప్పుకునట్టు సమాచారం వచ్చింది దీంతో మరో రెడ్ను మూడు రోజుల్లో జేడీ చంద్రబాబు తో భేటీ అయ్యి అధికారికంగా ఎప్పుడు సైకిల్ ఎక్కబోతున్నారో ప్రకటిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: