లోకేష్ పై క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ అధిష్టానం నారా లోకేష్ నియోజకవర్గం పై ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతుంది..? మంత్రి పదవిని సమర్ధవంతంగా చేపట్టిన లోకేష్ స్థానంపై ఎందుకు ఇంకా క్లారిటీ రావట్లేదు..? లోకేష్ ని ఎందుకు సేఫ్ సైడ్ గా గెలిచే స్థానాల నుంచే పోటీ చేయించాలని బాబు భావిస్తున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు.. ఎందుకంటే మొన్నటి వరకు లోకేష్ ని భీమిలి నుండి భరిలోకి దించాలని భావించిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ తన స్థానాన్ని మార్చేసింది. లోకేష్ ని విశాఖ నార్త్ నుండి భరిలోకి దింపాలని భావిస్తుయింది. ఇలా చూసుకుంటే రెండూ కూడా టీడీపీ కి కంచుకోటలే..!

భీమిలి నియోజకవర్గం గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు.. భీమిలి టీడీపీ కి కంచుకోట లాంటిది.. పైగా భీమిలి నుండి పోటీ చేయిస్తే లోకేష్ తప్పకుండా గెలుస్తాడని ఒక సెంటిమెంట్.. భీమిలి నుండి టీడీపీ ఇప్పటికే చాలా సార్లు గెలిచింది. పార్టీ ఆవిర్భవించిన తరువాత నుండి ఇప్పటి వరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. కేవలం ఒకేసారి టీడీపీ ఒడిపోవడం గమనార్హం. టీడీపీ స్థాపకలు ఎన్‌టి‌ఆర్ కూడా ఆ స్థానం నుంచి పోటీ చేశారు.. ఇక ఇలాంటి నియోజకవర్గం లో టీడీపీ లోకేష్ ని నిలబెడితే ఎలాగైనా గెలుస్తాడని భావించి అక్కడి టికెట్ ని ఇచ్చింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కి ఈసారి ఎంపీ టికెట్ ని ఇవ్వాలని బాబు భావిస్తున్నాడు. ఇక వైజాగ్ నార్త్ ది కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గట్టిగానే పోటీ ఇవ్వగలిగినప్పటికీ ప్రాంతీయంగా బీజెపీకీ అంతగా బలం లేదనేది వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం లో బీజేపీ కి అంతగా బలం లేదు.. ఉన్న బళాన్ని కూడా కోల్పోయింది. ఇక ఇలాంటి నియోజకవర్గం పై లోకేష్ ని భరి లోకి దించాలని బాబు భావించడం చర్చనీయాంశంగా మారుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: