ఒక్క రాఫెల్ వారి పది విమానాలకి సమానం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా వివాదాలతో పోరాడుతుంది రఫెల్ యుద్ధ విమానం. దేశ రాజకీయాల్లో మోడి పై చాలా ఇమ్ప్యక్ట్ చేసిన ఈ రఫెల్ ని కొనియాడారు భారత వైమానిక మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్. ఒక్క రాఫెల్ ఉంటే చాలు అని ఆయన అన్నారు.. మొన్న జరిగిన ఉగ్ర దాడి నేపధ్యంలో భారత్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జట్లు మిగ్ 21 యుద్ధ విమానాలతో వారి సరిహద్దులోకి చొరబడి ఉగ్ర శిబిరాల పై దాడులు చేసింది. దీన్ని డైజెస్ట్ చేసుకోలేని పాక్ మేమేమి తక్కువ తినలేదు అన్నట్టుగా వారి ఎఫ్ 16 విమానాలతో మన సరిహద్దులోకి చొరబడ్డాయి మన జట్లను చూసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి.

ఇది మనకి తెలిసిందే కానీ పాకిస్తాన్ కావాలనే మన సరిహద్దులోకి చొరబడి శ్రీనగర్, అవంతిపుర మిలిటరీ బేస్ లను లక్ష్యంగా చేసుకుందని మార్షల్ ఏవై టిప్నిస్. ఆ సమయంలో పాక్ కి సంభందించన 24 విమానాలు చొరబడ్డాయి అని ఆయన అన్నారు అలాంటి సమయం లో కేవలం ఒక్క రఫెల్ ఉండుంటే సరిపోయేడాని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం ఒక్క రఫెల్ కనీసం సగం విమానాలని తుడిచి పెట్టేడే అని ఆయన అన్నారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ఎవారొచ్చిన దేశ రక్షణ కి జరుగుతున్నా ఉగ్ర నిర్మూలనలో ఎలాంటి మార్పులు చేయవద్దని ఎవ్వరొచ్చిన కానీ ఏకరీతి పోరాటం జరపాలని ఆయన కోరారు. ఉగ్ర నిర్మూలనకై ఇంకా కూడా సరైన వ్యూహాన్ని రచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: