తనకి తన తమ్ముడికీ టికెట్ రాకుండా చాలా మంది నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు మంత్రి భూమా అఖిలప్రియ. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ టికెట్ ని రాకుండా అడ్డుకోలేరని ఆమె చెప్పారు. తనకి తన తమ్ముడు భూమా బ్రహ్మానంద రెడ్డి కి ముఖ్యమంత్రి పిలిచి మరీ టికెట్ ఇస్తారని ఆమె అన్నారు. కానీ కొంత మంది వైసీపీ నేతలు తెలియక బ్రహ్మానంద రెడ్డి కి టికెట్ ఇవ్వరని భావించి సంబరాలు జరుపుకుంటున్నారని ఆమె అన్నారు. ఇలా అడ్డుకున్న వారికీ సంభరాలు జరుపుకున్న వారికీ.. ఆమె సవాల్ విసిరారు..!
ఉపఎన్నికల మెజార్టీ కంటే ఒక్క ఓటు కూడా బ్రహ్మానందరెడ్డికి తగ్గదని… ఇదే తమ ఛాలెంజ్ అని సవాల్ విసిరారు. భూమా నాగి రెడ్డి వర్ధంతి సంధర్భంగా ఆ కార్యక్రమాన్ని నంద్యాలలో నిర్వహించారు.. ఈ సంధర్భంగా భారీ ర్యాలీని కూడా ఆమె నిర్వహించింది. ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి చావు కి కారణమైన వారిని గత ఎన్నికల్లో ఘూరంగా ఓడించి జిల్లాలోనే ఉండకుండా చేయాలని ఆమె ఇంతకీ ముందు చెప్పినట్టుగా ఈసారి కూడా అదే రీతిలో ఓడించి రాష్ట్రం లోనే ఉండకుండా చేయాలని ఆమె కార్యకర్తలని కోరారు.