ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ కూడా ఖరారైపోయింది అయినప్పటికీ ఇంకా నేతలు పార్టీలు మారే పనిలోనే ఉన్నారు. 16 నుండి నేతలు ప్రచారాలు మొదలు పెట్టనున్నారు. ఈపాటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఉంటే ప్రజలకి అభ్యర్థుల మీద ఒక క్లారిటీ ఉండేది.. కానీ కొందరు కీలక నేతలు ఇప్పటికీ పార్టీలు మారుతూనే ఉన్నారు దీంతో అధినేతలకి టికెట్ ఎవరికి ఇవ్వాలో అర్ధం కావట్లేదు.. ఒక పట్టాన అసలు ఎవరు ఎప్పుడూ ఎందుకు పార్టీ ని వీడుతున్నారో ఏ పార్టీలోకి చేరుతున్నారో నేతలకీ జనానికి అర్ధం కాని పరిస్తితి. ఇక ఈ తికమక లో అధినేతలు జాప్యం చేయాల్సి వస్తుంది. ఎవ్వరైయన గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తారు ఇక గెలిచే వారు పార్టీలు మారితే అక్కడ కన్ఫ్యూజన్ మొదలవుతుంది.
ఇక ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని చెప్పాలి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. రోజులు దేగ్గర పడుతున్న ఆయన పార్టీ లోకి నేతలు వస్తూనే ఉన్నారు. నేడు కూడా ఆయన పార్టీ కి పలువురు కీలక నేతలు రావడం తో ఆయన టికెట్ల సద్దుబాటులో మళ్ళీ మొదటికి వచ్చేశారు. అసలు కధనాల ప్రకారం నేడు జగన్ తన పార్టీ అభ్యర్థుల జాబితాని విడుదల చేస్తానని చెప్పారు. కానీ ఇవాళ ఉదయం పీవీపీతో పాటు తోట నర్సింహం కుటుంబం వైసీపీలో చేరింది. దీనితో పాటు వచ్చే రెండు రోజుల్లో భారీ చేరికలు ఉండే అవకాశం ఉండటంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక వారిని ఆహ్వానించే లోగా అనుకున్న ముహూర్తం దాటిపోయింది. దీంతో పూర్తి సద్దుబాట్లు చేసి అభ్యర్థుల జాబితాని 16 న విడుదల చేయాలని పార్టీ భావిస్తుంది. సమాచారం ప్రకారం 16వ తేదీ ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మొత్తం 175 మందితో మొత్తం జాబితాని 10.26 గంటలకి ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు.