ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలు ఉన్నప్పుడు నేతలు సహనంగా వ్యవహరించాలి ఆచితూచి ముందుకి సాగాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ కొన్ని నిభందనలని జారీ చేసింది. ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి క్యాడర్ తో సంభందం లేకుండా అందరూ ఈ నిభందనలనీ ఫాలో అవ్వాలి లేకపోతే కొన్ని సంధార్భాల్లో క్రిమినల్ కేస్ లని సైతం ఎన్నికల కమిషన్ విదిస్తుంది. ఒక వేల నిభందనలనీ తిరస్కరిస్తే ఆ నేతకి మూడు ఆప్షన్స్ ఉంటాయి.. తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం, రిజక్ట్ చేయడం. తప్పు ఒప్పుకున్నప్పటికీ క్షమాపనని లికితపూర్వకంగా ఎలెక్షన్ కమిషన్ కి అంధించాల్సి ఉంటుంది.
ఎన్నికల నిభంధనలని ఫాలో అవ్వకుండా ఉన్న నేతలు మోదీ, అమిత్ షా, మమతా బెనర్జీ కి సైతం వేటు తప్పలేదు. వారిపై కూడా సీరియస్ అయ్యింది. 2017 గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్లో తన ఓటు వేశాక పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ పోలింగ కేంద్రం ఆవరణలో పార్టీ గుర్తు ప్రదర్శించడం, ఓటేసినట్టుగా వేలును చూపడంపై కేసు నమోదైంది. అలాగే అమిత్ షా కి కూడా వేటు తప్పకపోలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సమాజ్వాదీ పార్టీ నేత అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో వారు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ అడ్డుకుంది. వారు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో నిషేధాన్ని ఎత్తివేసింది.