అనంతపురంలో జిల్లా లో టీడీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మెడియ తో పంచుకున్నారు. సునీత రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. ఒకవేళ కుదరదంటే నేను పోటీచేయను ఆమె ప్రకటించారు. అభిమానుల కోరిక మేరకు శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆమె అన్నారు. చంద్రబాబు నిర్ణయం మేరకు ముందుకెళతాం ఆయన అన్నదే అనుసరిస్తాం అని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. అభిమానుల కోరిక మేరకు రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును రెండు సీట్లు అడుగుతున్నామని వెల్లడించారు. ఒకవేళ రెండు సీట్లు ఇవ్వని పక్షంలో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. తాను పోటీ నుండి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పరిటాల సునీత తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయం మేరకు ముందుకు వెళతామని స్పష్టం చేశారు.