‘హీరో’ లో హీరోలుగా యువ హీరోలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని అనేక బాషల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. కాగా ఒక రీతిలో చెప్పాలంటే విజయ్ కి తెలుగు లోనే కాకుండా సౌత్ లో మంచి మార్కెట్ ఏ దొరుకుతుందని చెప్పొచ్చు. నోటా తో బోల్తా పడ్డప్పటికీ ఈ యువ హీరోకి వేరే బాషల్లో కూడా మంచి మార్కెట్ ఉందని దర్శకులు నిర్మాతలు భావిస్తున్నారు.

డియర్ కామ్రేడ్ సినిమా త్వరలో పూర్తి కానుంది ఈ సినిమా తరువాత విజయ్ హీరో అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో విజయ్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడట. కథానాయికగా మాళవిక మోహనన్ ని ఎంచుకున్నారు. నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందించే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. డియర్ కామ్రేడ్ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించడం గమనార్హం. కాగా రెండు సినిమాలనీ అనేక బాషల్లో తెరకెక్కిస్తున్నారు. కథ బాగుండటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చిత్రా యూనిట్ పేర్కొంది. అయితే అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా మొదలు కాకముందే చిన్న చిక్కులో పడింది. రేమో సినిమా ఫేమ్ శివ కార్తికేయన్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. దీనికి కూడా ‘హీరో’ అనే టైటిల్ నే కన్ఫామ్ చేసారు. షూటింగ్ కూడా ముందుగానే మొదలైంది కాబట్టి ఈ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ రెండూ సినీమాలకీ ఒకే టైటిల్ ఉండటంతో ఇరు దర్శకులు కాస్త ఇబ్బంది పడుతునట్టు తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: