ఉండవల్లి వేదికగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆయన వైసీపీ అధినేత జగన్ పై తెలంగాణ సర్కారు పై ద్వాజమెత్తారు.. విమర్శలు చేశారు, సెటైర్లు విసిరారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను కొందరు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షలాది ఓట్లను తీసేయడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు అని ఆయన అన్నారు. ఇది దివాళాకోరు రాజకీయం..! ఇంత నీచమైన రాజకీయం ఎప్పుడూ చూడలేదు వీరు బ్లూ ప్రింట్ ఇస్తే తెలంగాణా పోలీసులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
వ్యాపారాలు అడ్డదారి-రాజకీయం అడ్డదారి ఇది వైసీపీ నేతల వైఖరి. అతని జీవితమే అడ్డదారి-అతని పార్టీదే చెడ్డదారి.. ఇది ఆ పార్టీ అధినేత వైఖరి అంటూ పంచ్ డైలాగ్స్ వేశారు. ‘’ తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’’ అన్నట్లు… అతను చెడిందే కాక తన తోటి వాళ్లను కూడా చెడగొట్టాలని చూడటం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది..! అంటూ జగన్ పై విరుచుకపడ్డారు. దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన, అతని నేరాలకు అంతే లేదు..! అంటూ జగన్ పై బాబు మండిపడ్డారు.
ఒకప్పుడు జగన్ వ్యాపారంలో..ఇప్పుడు అతని రాజకీయంలోనూ నేరాలను కుట్రలనే చూశాం నీటి నిజాయితినే చూడలేదు. లక్షలాది ఓట్ల తొలగింపు ఆలోచనలు ఎవరికైనా వస్తాయా..? 9లక్షల ఫామ్ 7 దరఖాస్తులు పంపడం దేశ చరిత్రలో చూశామా..? ప్రత్యర్ధి పార్టీ డేటా ఎత్తుకుపోదాం అనే ఆలోచన ఎవరైనా చేస్తారా..? అంటూ ఆయన వ్యంగ్యపు సెటైర్లు విసిరారు.