బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ లపై ఫైరయ్యారు. ఇదారి పై సెటైర్లు వేశారు.. ఒక రీతిలో చెప్పాలంటే ఇద్దరినీ ఉతికారేశారు. బాబు తనదైన స్టైల్ లో వారి పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేస్తున్న జోక్యం పై స్పందిస్తూ.. “ఆయనో మహానాయకుడు… మనమీదకు ఒంటికాలి మీద వస్తాడు. హైదరాబాద్ లో ఏపీ డీజీపీ ఇంటి ప్రహరీగోడ నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ కేవలం ఆరోపణ మాత్రమే వచ్చింది. దానిమీద కోర్టు జోక్యం చేసుకున్నా గానీ తెల్లవారుజామునే ఎవరికీ తెలియకుండా ప్రహరీగోడ కూల్చేశారు మరి జగన్ అన్నీ కుట్రలు చేసిన అవి వారి కంట పడలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు.

ఇక జగన్ ని అయితే ఓపాటున ఉతికారేశారనే చెప్పాలి.. జగన్ నేరాలకి గ్రాండ్ మాస్టర్.. జగన్ కొన్ని వందల నేరాలు చేసీనా అవి మీకు కనిపించలేదా.. ఏపీ డీజీపీ ఇంటి గోడ పై చర్యలు తీసుకోవడం తెలిసిన మీకు నేరాల గ్రాండ్ మాస్టర్ జగన్ పై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ” అంటూ నిలదీశారు చంద్రబాబు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్, జగన్ పొత్తు కుట్రల వ్యవహారాలకు నిదర్శనలని మండిపడ్డారు. జగన్ పూర్తిగా కేసీఆర్ కు లొంగిపోయారని,ఇక కెసిఆర్ ని బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా! అనే స్థాయికి జగన్ దిగిపోయారు’ అంటూ ఇద్దరిని వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఉతికారేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: