ప్రపంచ్ కప్ ముందు భారత అభిమానులకి నిరాశా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ ఆస్ట్రేలియా సిరీస్ భారత క్రికెట్ అభిమానులకి చేదు అనుభూతిని మిగిల్చింది. భారత్ పై సిరీస్ ప్రకటించి భారత్ కి వచ్చిన ఆస్ట్రేలియా భారత్ పై టీ20 సిరీస్ ని వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. రెండిటికీ రెండు సిరీస్ లని ఆస్ట్రేలియా సొంతం చేసుకోడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో అనూహ్య పరిణామం గడిచిన పదేళ్ళలో ఎప్పుడూ భారత్ ఇలా ఓటమిపాలవ్వలేదు. గత పదేళ్లుగా ఆస్ట్రేలియా ఎప్పుడూ ఇలాంటి విజయం సాదించలెకపోయింది. పదేళ్ళకి ముంది ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు సిరీస్ లని గెలిచి ఆస్ట్రేలియా చరిత్రని తిరగ రాసింది.

ఇది వరకు భారత్ ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా ని టెస్ట్ మ్యాచ్ సిరీస్ వన్డే మ్యాచ్ సిరీస్ రెండిటినీ గెలిచి విజయాన్ని సాదించుకొచ్చింది. ఇక దీన్ని పరువుగా భావించిన ఆస్ట్రేలియా భారత్ కి వచ్చి 2-1 తేడా తో టీ 20 సిరీస్ 2-3 తేడా తో వన్డే సిరీస్ లని కైవసం చేసుకుంది. కొద్ది నెలలుగా ఫామ్ లో లేని ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తితిగి ఫామ్ సాదించాడు. టెస్ట్ బ్యాట్‌స్మెన్ ఉస్మాన్ ఖవాజ అధ్బుతమైన ప్రదర్శన కనబరిచి వరల్డ్ కప్ కి చోటు కన్ఫామ్ చేసేసుకున్నాడు. అవకాశం వచ్చిన 4 మ్యాచ్లలో ఖవాజ రెండు సార్లు సెంచరీ ఒకసారి 90 పైగా స్కోర్ సాధించి ఆస్ట్రేలియా గెలుపుకి కీరోల్ ప్లే చేశాడు.

ఇక నిన్నటి మ్యాచ్ లో ధావన్ మళ్ళీ ఫాయిల్ అయ్యాడు. కోహిలి 20 రన్లు చేయగా. అందరి ఆశలు రోహిత్ పై పెట్టుకున్నారు కానీ రోహిత్ 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.. ఆపై వచ్చిన కేదార జాదవ్ 44 పరుగులు బౌలర్ భువనేశ్వర్ 46 పరుగులు చేశారు. ఇక టాప్ ఆడర్ భారీగా విఫలమవ్వడం తో ఆస్ట్రేలియా పై 35 రన్ల తేడాతో ఓడిపోయారు. ప్రపంచ కప్ కి ముందు ఇలా ఓడిపోవడం భారత అభిమానులకి కాస్త అసహనం తెప్పించింది. ఇక ఇలాంటి సమయం లో ఆస్ట్రేలియా గెలుపు ఆస్ట్రేలియన్ అభిమానులకి విశ్వాసాన్ని మేల్కొల్పింది.

Share.

Comments are closed.

%d bloggers like this: