ఇదెక్కడ శాంతో ఎవ్వరికీ అర్ధం అవ్వట్లేదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉగ్రవాదాన్ని పూర్తిగా అనచి వేయాలని భారత్ ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ తరహాలో ఎక్కడ ఉగ్రవాదం కనపడినా.. సమాచారం వచ్చినా సి‌ఆర్‌పి‌ఎఫ్ అధికారులు జవాన్లు అక్కడికి వాలిపోతున్నారు. ఇళ్ళలో దాసుకున్న వారిని మట్టికరిపిస్తున్నారు. ఇప్పటికే భారత జవాన్లు 21 రోజ్జుల్లో 18 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారని అధికారికంగా ప్రకటించారు. భారత్ ఇలా అణచి వేయాలని చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

జైషే మహమ్మద్, అల్ ఖైదా వంటి ఉగ్ర మూకలు మరెన్నో పాకిస్తాన్ లో తల దాచుకుంటున్నాయి. పాకిస్తాన్ అధికారులు దాడులు జరగ గానే మీడియా ముందుకి వచ్చి మేము చర్యలు తీసుకుంటున్నాము అని పలకడం తప్ప ఎటువంటి చర్యలు తీసున్నట్టు కనపడటం లేదు పైగా పాక్ ప్రధాని తాను శాంతి గురించి ఎంతగానో పాల్పడుతున్నానని చెప్పుకుంటున్నాడు. మరి ఇదెక్కడ శాంతో ఎవ్వరికీ అర్ధం అవ్వట్లేదు.

ఇక ఇటువంటి పరిస్థితులలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మండిపడింది. పుల్వామ దాడుల తరువాత భారత్ జేరుపుతున్న దాడులకి పాకిస్తాన్ ఆందోళన చెందుతుందని ఆమె అన్నారు. ఉగ్రవాదం ఉన్న దేశంతో స్నేహం చేయడం కష్టం అని అలాంటి దేశాలతో చర్చలు సాగవని కాబట్టి ఇలాంటి స్థితిలో పాక్ నుండి సరైన్ చర్యలు ఆశిస్తున్నామని ఆమె పేర్కొనింది. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని తాను వారికి చెప్పానని తెలిపారు. ఇదే సమయంలో, పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే… తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పానని అన్నారు.

ఇప్పటికే అనేక విదేశాంగ మంత్రులు ఈ విషయమై పాక్ ని ఖండిస్తున్నారని ఆమెతో ఫోన్ లో మాట్లాడినట్టు ఆమె తెలిపింది. పాక్ ప్రధాని శాంతికి ఎంతగానో కృషి చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు ఒకవేళ అది నిజమే అయితే భారత్ పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని ఇంకా ఎందుకు తమ దేశం లో తల దాచుకోనిస్తున్నారు అని ఆమె ప్రశ్నించింది. మీ మాటలు నిజమే అయితే మసూద్ ని భారత్ కి అప్పగించండి అప్పుడే మీ మాటలు నిజమవుతాయి అని ఆమె పేర్కొనింది.

Share.

Comments are closed.

%d bloggers like this: