బాహుబలి సినిమా మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. దీంతో నటుడు ప్రభాస్ కి దర్శకుడు రాజమౌళికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇంతటి విజయం సాధించడానికి దర్శకుడు రాజమౌళి ఎంతగానో కష్టపడ్డాడు దానికి ప్రతిఫలం అత్యద్భుతంగా దక్కింది. ఇక బాహుబలి సినిఒమ తరువాత సంవత్సరం పాటు ఫ్యామిలీ తో పాటు గడిపాడు జక్కన్న.. అప్పుడే ఒక ఆధుభూతమైన కథని తయారు చేసుకున్నాడు. ఇక బాహుబలి తరువాత అదే స్థాయి హిట్ కొట్టడానికి చాలా రీసర్చ్ చేశాడు.. కథని కళ్ళకి కట్టడానికి కథకి తగ్గ నటులని పరిశీలించి ఎన్టిఆర్ రామ్ చరణ్ ని ఎంచుకున్నాడు. జాతీయ స్థాయి లో అందరికీ రీచ్ అవ్వడానికి బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ అళియ భట్ లని కూడా తారాగణం లోకి చేర్చాడు.
సినీ అభిమానులకి ఒక ఆధుభూతమైన అనుభూతి కలిగించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. హీరోలిద్దరికీ నిభందనులు కూడా పెట్టేశాడు. ఈ సంధర్భంగా నేడు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో కథ గురించి కొన్ని ఆశక్తికర విషయాలని ఆయన వెల్లడించాడు. కథ స్వాతంత్రియ ఉద్యమకారుడు అల్లూరి సీతా రామరాజు, గిరిజన స్వతంత్రియ ఉద్యమకారుడు కొమరం భీమ్ ల చుట్టూ తిరుగుతుంది. సినిమా చాలా ఫిక్షనల్ గా నడవనుంది. ఇద్దరు ఒక కాలం వారు కావడం ఇద్దరు ఉద్యమ కారులుగా మారడం ఇద్దరు బ్రిటిషర్ల చేతిలో అమరులు కవాడం అన్నీ ఒకే రీతిలో ఒకే సమయంలో జరగడం జక్కన్నకి చాలా ఆసక్తిగా అనిపించడంతో ఈ కథ పై రీసర్చ్ చేశాడు.. ఒకవేళ ఇద్దరికీ ఏదైనా సంబంధం ఉండుంటే ఎలా ఉండేదో అనేదాని పై ఆయన కథ రదీ చేసినట్టు మీడియా ముందు వెల్లడించాడు.
ఇక సినిమాకి అజయ్ దేవగన్ తో చర్చలు చేయగా ఆయన ఒప్పుకునట్టు ఆయనకి ఒక ముఖ్యమైన రోల్ ఉన్నట్టు జక్కన్న తెలిపారు.. ఇక కథానాయికలుగా అలియా భట్ డేజీ అడ్గారియన్స్ ని చూపించబోతున్నారట..! చరణ్ సరసన అలియా భట్ ఉండగా తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ నటించబోతున్నారు.. సినిమాని రియలిస్టిక్ గా చూపించడానికి చాలా కష్టపడుతునట్టు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కి కథని జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు.. ఇక రాజమౌళి దర్శకుడు.. డీవీవీ బ్యానర్ పై డీవీవీ దానయ్య సినిమా ని నిర్మించబోతున్నారు. బానీ లని కీరవాణి సమకూర్చనున్నారు. ఈ సినిమా ని అనేక భాషల్లో ప్రతీ భాషలో డిఫరెంట్ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు ఇక ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా RRR ఉందని అందరికీ తెలుసు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా బాహుబలి రేంజ్ లోనే చూపించబోతున్నారని అర్ధం అవుతుంది.