రాయపాటి కూడా జంప్ చేయబోతున్నారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కొంత కాలంగా రాయపాటి సాంబశివ రావు పై కొన్ని ప్రచారాలు పుకార్లు ఎగిసిపడుతున్నాయి.. అయితే అవి కేవలం అవాస్తవాలుగా భావించారి టీడీపీ నేతలు. అయితే తాను నరసారావు పేట నుండి టికెట్ ఆశిస్తునట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు కి చెప్పినట్టు సమాచారం. అయితే దీనికి అనుగూనంగా చంద్రబాబు ఆయనకి గుంటూరు నుండి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు.. ఈ విషయమై నిన్న అధికారికంగా టీడీపీ నుండి ప్రకటన కూడా వచ్చింది. గుంటూరు ఎంపీ టికెట్ తనకి అసంతృప్తి ఉందేమో అనెట్టుగా పరిణామాలు కనపడుతున్నాయి.

నరసరావు పేట్ లోక్సభ అయితేనే బరిలోకి దిగుతానని ఆయన చెప్పినప్పటికీ హైకమాండ్ అంగీకరించకపోవడం తో ఆయన కొంత మేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారులు క్యాష్ ఇన్ చేసుకోడానికి సన్నాహాలు జరుపుతున్నట్టు సమాచారం.. ఇక సాంబశివరావు గుంటూరులోని ఆయన స్వగృహంలో ఈరోజు తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియా తో మాట్లాడినా ఆయన టీడీపీ షాక్ ఇచ్చే రీతిలో బాంబ్ పేల్చారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లోక్ సభ స్థానానికి పోటీచేసేందుకు తనకంటే సమర్థులైన అభ్యర్థులు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. తనకంటే సమర్థులు ఉంటే పార్టీ హైకమాండ్ వారికే టికెట్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. ఈసారి నరసరావుపేట టికెట్ తనకు ఇస్తే మరోసారి పోటీచేస్తానని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా చర్చలు జరుపుతున్నారని రాయపాటి బాంబు పేల్చారు. నరసరావుపేట టికెట్ విషయంలో ఈరోజు సాయంత్రంలోగా టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: