హైదరాబాద్ లో జాబ్లా పేరిట పెరుగుతున్న మోసాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాయ మాటలు మోసాలు :

మోసగాళ్ళకి అనేక దారులు అన్నట్టు..! మోసం చేయడానికి సిద్ధం అయితే చాలు ఏదో ఒక తలుపు ఎప్పుడూ తెరుచుకొనే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు ఉన్న దారులన్నీ మూసుకుపోయి చివరకి న్యాయానికి లొంగక తప్పకపోదు. అయితే మోసగాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త రూట్ కనపడుతుంది..! అదేంటంటే ఉద్యోగం..! ఈ ఉద్యోగాల పేరిట జరుపుతున్న మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అవకాశవాదులు ఎక్కువైపోతున్నారు..వారిని టార్గెట్ చేస్తే చాలు మోసానికి రూట్ క్లియర్ అయినట్టే..!

ఉద్యోగ అవకాశాలు దొరకక ఉన్న అమయకులని వెతుకుతారు, ఆపై వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముందుకొస్తారు. మేమున్నాము అని దైర్యం చెబుతారు. ఆపై ప్రగల్భాలు..! తమకి చాలా హోదా ఉందని గవర్నమెంట్ పెద్దలతో సంభందాలు ఉన్నాయని వారు చెబితే చాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్టే ఇచ్చేస్తారని అమాయకులని నమ్మిస్తారు. కానీ దానికి ఇంత డబ్బు కర్చు అవుతుందని లాక్ చేస్తారు.

ఇల్లు గడపాడానికే కష్టంగా ఉండే పేదలు వీరిని నమ్మి ఇరుగు పొరుగు వల్ల దేగ్గర ఉన్నవన్నీ తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ డబ్బు తెస్తారు.. తెచ్చినదంతా వారికి దార పోస్తారు.. ఇక అంతే సంగతులు..! ఒక్కసారి వారి చేతికి డబ్బందిందంటే చాలు కొందరు పారరావుతారు, మరి కొందరు నిర్లక్ష్యంగా పుటకోమాట చెబుతూ కాలం గడిపేస్తారు.. వీరికి తెలియనిదెంటంటే ఏదో ఒక రోజు వారి పాపాలు పండి చట్టం చేతి కిందకి వచ్చి చిక్కుకుంటారు. వారు చేసిన దానికి బాధ పాడతారు.

job fraud

ఒకే వారం లో రెండో కేసు :

మొన్న ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్ అంటూ ఒకడు ఏకంగా 10 కోట్లకే ఎసరు వేశాడు, ఇక నేడు దాదాపుగా 2 కోట్లకి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చైతన్యపురి పరిది లోని జాయిన్ అస్ కన్సల్టెన్సీ నిర్వాహకులు బూదరాజు రాధాకృష్ణ , కవిత రెడ్డి , జాక్సన్ కలిసి దాదాపుగా 2 కోట్లు కొట్టేశారు..! మాయ మాటలు చెప్పి ప్రజలని నమ్మించి 185 మందిని పిచ్చివాళ్లని చేశారు.

ప్రధానమంత్రి  గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకం ద్వారా ఔట్ సోర్సింగ్ విధానం కింద కోఆర్డినేటర్లుగా ఉద్యోగాలు పెట్టిస్తామని వారి వద్ద డబ్బు తీసుకున్నారు.. అలా కాలం గడుస్తుంది కానీ ఎవ్వరికీ ఉద్యోగం రావట్లేదు. వారు తెచ్చిన అప్పుకి వడ్డీలు పెరిగిపోతున్నాయి ఇక వీరి వెంట పడటం ప్రారంభించారు.. కానీ కన్సల్టెన్సీ నుండి నో రెస్పాన్స్. ఇక సహనం కోల్పోయిన కొందరు పోలీసులకి ఇంఫామ్ చేయగా వీరి వ్యవహారం బయట పడింది.. పోలీసులు పూర్తిగా కూపి లాగగా వారి వయ్యారం బయట పడింది. ఇక వీరి వద్ద నుండి ఒక హోండాయ్ కారు, 6 చరవాణులు, రెండు బంగారు నగలు, రెండు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎల్బీనగర్ ఏసీపీ పృథ్విధరరావు , ఇన్సిపెక్టర్ సుదర్శన్ మీడియా సమావేశంలో తెలిపారు

విడ్డూరం ఏంటంటే మోసం చేసే వారికి అవకాశ వాదులు ఎక్కువగా హైదరబాద్ లోనే కనిపించడం..! ఇలా ఒకే వారంలో ఇలాంటివి 2 కేసులు నమోదయ్యాయి ఒకటి చాదర్ఘాట్ పరిదిలో ఇప్పుడు చైతన్యపురి పరిదిలో. ఈ విషయమై గవర్నమెంట్ ఏదో ఒక విదానం అనుసరించి ఇలాంటి వారిని చెక్ పెట్టాలి లేకపోతే ఈ కేసుల సంఖ్య  రోజురోజుకీ పెరిగిపోతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: