అమ్మాయి ఫోటో చూశాడు..! కత్తితో పొడిచేసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సాదారణంగా అమ్మాయిలు అన్నీ విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు దేనికి ఆవేశం తెచ్చుకోరు. కానీ తనని ఎవరైనా అందంగా లేవని అన్న.. లేకపోతే వేరే అమ్మాయిలని పొగిడినా అస్సలు ఓర్చుకోలేరు.. భరించలేరు. సహనాన్ని కోల్పోటూ ఉంటారు.. తికమక లో ఏడెదో చేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఏకంగా పొడిచేసింది. తాను ఎంతగానో ఇష్టపడ్డ తన బాయ్‌ఫ్రాండ్ వేరే అమ్మాయి ఫోటోను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ విషయాన్ని తట్టుకోలేని ఆమె తన బాయ్ ఫ్రాండ్ ని పొడిచేసింది. ఈ ఘటన ఫ్లోరిడా లో జరిగింది. అక్కడ స్థానికంగా ఈ ఘటన వైరల్ అవుతుంది.

ఫ్లోరిడాకు చెందిన జూలిట్టా ఎమిలీ అనే అమ్మాయి ఓ అబ్బాయి తో ప్రేమలో పడింది. అతనితో డేటింగ్ కూడా చేస్తుంది.. ఇప్పుడూ ఆ అమ్మాయి గర్భవతి కూడా..! అయితే ఇక ఎక్కువ కాలం అలానే ఉంటే బాగోదని పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. జూలిట్టా తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు అతను ఉంటున్న ఇంటికెళ్లింది. ఆమె, తన బాయ్‌ఫ్రెండ్, మరో స్నేహితుడు కలిసి మాట్లాడుకుంటున్నారు.

ఇంతలో మరో స్నేహితుడు తన గర్ల్‌ఫ్రెండ్ ఫోటోను జూలిట్టాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కూ చూపించాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు జూలిట్టా బాయ్‌ఫ్రెండ్. దాన్ని గమనించిన జూలిట్టా… అతనితో గొడవకు దిగింది. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. లోపలి నుంచి వస్తున్న శబ్దాలను బట్టి అక్కడ గొడవ బీభత్సంగా జరిగిందని గ్రహించాడు స్నేహితుడు.

కొద్దిసేపటి తర్వాత జూలిట్టా బాయ్‌ఫ్రెండ్ కత్తిపోటుతో గదిల్లోంచి బయటికి వచ్చాడు. ‘అది నన్ను పొడిచేసింది’ అంటూ కిందపడిపోయాడు. అతని వెనకే వచ్చిన జూలిట్టా… ‘నేను పక్కనే ఉండగా… మరో అమ్మాయి ఫోటోని ఎందుకిలా తదేకంగా చూస్తున్నావ్’ అంటూ అరిచింది. కంగారు పడిన స్నేహితుడు… పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… జూలిట్టాను అదుపులోకి తీసుకుని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను ఆసుపత్రికి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: