వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానంద రెడ్డి నేడు తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. కానీ ఈ మరణం పై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి పోలీసుల సమాచారం మేరకు వివేకా రక్తపు మడుగుల్లో పది ఉన్నారని తల పై చేతి పై తీవ్రమైన గాయాలు ఉన్నాయని అన్నారు, అంటే కాకుండా వివేకా బాత్రూమ్ లో బెడ్ రూమ్ గోడలపై రక్తపు మరకలు కనిపించడం అనుమానాలకి దారులు తీస్తున్నాయని వాళ్ళు పేర్కొన్నారు.
ఇక అక్కడి చేరుకున్న వైసీపీ ఎంపీ వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు విజయ్ సాయి రెడ్డి అక్కడి పరిస్థితులని పరిశీలించాడు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందన్నారు. ఈ వార్తా తెలియగానే ఆయనేంతో దిగ్బ్రాంతికి గురయినట్టు తెలిపారు.. ముందుగా గుడెపోటు చనిపోయారని వార్తలు రాక ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి ఈ మరణం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.
వివేకా బాడీ ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని వారి రిపోర్ట్ ఆదారంగానే ఏమైయన తెలిసి ఛాన్స్ ఉందని ఆయన అన్నారు. వివేకా మరణంపై లోతైన దర్యాప్తు జరపాలని వైసీపీ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఆయన మరణం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాన్ని విజయసాయి వ్యక్తం చేశారు. జగన్ కొద్దిసేపట్లో పులివెందుల చేరుకుంటారని తెలిపారు. ఇక ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వివేకానడ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయనై ఆయన తెలియజేశారు.